పుట్టింట్లో పెళ్లి ఆగింది.. మెట్టినింట్లో పెళ్లి జరిగింది!

0

విన్నంతనే అర్థమై.. మళ్లీ కానట్లు అనిపించిన ఈ ఉదంతంలోకి వెళితే.. బాలీవుడ్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన ప్రియాంక చోప్రా ఉంది కదా.. ఆమెకు సంబంధించిన విషయమిది. ఆమె పుట్టినింట్లో జరగాల్సిన పెళ్లి ఆగిపోతే.. మెట్టినింట్లో మాంచి జోష్ లో పెళ్లి జరిగిపోయింది. కన్ఫ్యూజింగ్ గా ఉందా? ఓకే.. మరింత వివరంగా చెబుతాం.

ప్రియాంకకు ఒక సోదరుడు ఉన్నాడు. అతడి పేరు సిద్ధార్థ్. అతను ఇషితా కుమార్ అనే యువతిని ప్రేమించారు. వీరిద్దరి ప్రేమకు.. పెళ్లికి ప్రియాంక ఇంట్లో ఓకే చెప్పేశారు. దీంతో.. ఎంగేంజ్ మెంట్ కూడా జరిగిపోయింది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. ఈ పాటికి పెళ్లి జరిగిపోయి ఉండేది కూడా. మరేం జరిగిందో కానీ.. ఇషితాకు ఏదో సర్జరీ జరిగిందని చెబుతూ పెళ్లిని పోస్ట్ పోన్ చేశారు.

ఆరోగ్య కారణాల వల్ల పెళ్లి వాయిదా పడిందని భావించారు. కానీ.. వారిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని.. వారి పెళ్లి క్యాన్సిల్ అయినట్లు చెబుతున్నారు. ఈ వాదనను బలపరుస్తూ.. వారి ఎంగేజ్ మెంట్ ఫోటోల్ని ఇషితా తొలగించటంతో.. బ్రేకప్ పక్కా అని తేలిపోయింది. సోదరుడి పెళ్లి కోసం అమెరికా నుంచి ముంబయి వచ్చిన ప్రియాంక.. మళ్లీ తిరిగి వెళ్లిపోయారు కాస్త భారంగా.

ఇదిలా ఉంటే.. మెట్టినింట్లో మాత్రం అనుకున్నట్లే మరో పెళ్లి జరిగింది. ప్రియాంక ప్రేమించి పెళ్లాడిన నిక్ జోనాస్ ఉన్నాడు కదా. అతడికో సోదరుడు ఉన్నాడు. అతగాడి పేరు జో జొనాస్. జో అని పిలుస్తుంటారు. అతడు హాలీవుడ్ నటి సోఫీ టర్నర్ ను ప్రేమించాడు. వారి ప్రేమ వివాహం తాజాగా అట్టహాసంగా జరిగినట్లు తెలుస్తోంది. మొత్తానికి సోదరుడి పెళ్లి క్యాన్సిల్ బాధను.. మరిది పెళ్లి వేడుక కవర్ చేసినట్లుగా చెప్పాలి.
Please Read Disclaimer