నరేష్ అండ్ సునీల్.. సిల్లీ ఫెలోస్

0కామెడీతో టాలీవుడ్ కింగ్ లు అనిపించుకున్న హీరోలు అల్లరి నరేష్ – సునీల్ కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరు కొన్ని సినిమాల్లో కనిపించినప్పటికీ ఆ సినిమాలకు ఇప్పుడు వచ్చే సినిమాకు సంబంధం లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా మంచి గుర్తింపు ఉన్న హీరోలు. పైగా చాలా కాలం తరువాత కలిశారు. దీంతో వీరు చేస్తున్న సినిమాపై అంచనాలు బాగానే పెరుగుతున్నాయి.

ఇక ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. సిల్లీ ఫెలోస్ అనే ఈ సినిమాకు సుడిగాడు దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నాడు. గత కొన్ని నెలల క్రితం స్టార్ట్ చేసిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఎండింగ్ దశలో ఉంది. సినిమా ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చేయాలని దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడు. వచ్చే నెల సినిమా విడుదలపై ఒక క్లారిటీ రానుంది. పోస్టర్ లో సునీల్ పై నరేష్ ఎక్కి స్మైల్ ఇస్తున్నాడు.

చూస్తుంటే ఈ సారి ఇద్దరు హీరోలు కలిసి ఒక హిట్టు కొట్టేలా ఉన్నట్లు అనిపిస్తోంది. దర్శకుడు భీమనేని శ్రీనివాస్ కూడా స్క్రిప్ట్ విషయంలో చాలా కసరత్తులు చేశాడు . ఇక ఈ సినిమాలో పూర్ణా – చిత్ర శుక్ల హీరోయిన్స్ గా కనిపించనున్నారు. బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్లు సిల్లీ ఫెలోస్ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.