ప్రియాంక, సమంత తప్పు చేశారా..?

0Alleagations-on-Heroines-Dressingటాలీవుడ్ బ్యూటీ సమంత ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. ప్రస్తుతం బ్యాంకాక్.. థాయ్ ల్యాండ్ లలో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సమంత.. తను షేర్ చేసిన కొన్ని ఫోటోల కారణంగా సోషల్ మీడియాలో కొందరికి టార్గెట్ అయిపోయింది. తన ఎలా ఎంజాయ్ చేయాలని అనుకుంటుందో చెప్పేందుకు బికినీ టూ పీసెస్ ను ఫోటో తీసి షేర్ చేసింది సమంత.

ఓ పెద్దింటి కోడలు కాబోతున్నపుడు కాసింత పద్ధతిగా ఉండడం నేర్చుకోమంటూ క్లాసులు పీకేవాళ్లు ఎక్కువైపోయారు. నిజానికి ఈ ఫోటోను సమంత షేర్ చేయకపోతే.. అందులో పెద్ద మ్యాటరేమీ లేనట్లే. కానీ సామ్ షేర్ చేసినంత మాత్రాన ఇందులో చెడు వెతుక్కోవడం ఏంటో అర్ధం కాని విషయం. ఇక్కడ మారాల్సినది సమంత కాదని.. చూసే వాళ్ల మైండ్ సెట్ అని అనడంలో సందేహం అక్కర్లేదు. ఇలాంటి ఉదంతమే ప్రియాంక చోప్రా విషయంలో కూడా ఎదురైంది. ప్రధాని నరేంద్ర మోడీని కలిసేటపుడు సరిగ్గా కాళ్లు కప్పుకోవడం చేతకాదా అని ఆమెను నిలదీయడాన్ని ఎలా సమర్ధించాలో అర్ధం కాని విషయం.

ప్రియాంక ఏమీ వల్గర్ గా డ్రెసింగ్ చేసుకోలేదు. పైగా వాళ్లిద్దరూ తారసపడినది బెర్లిన్ లో అనే సంగతి గుర్తుంచుకోవాలి. కాళ్లు కాసింత కనిపించనంత మాత్రాన పద్ధతుల మీద క్లాసులు పీకడం కూడా సమర్ధనీయం కాదు. ఇలాంటి విషయాల్లో అవతలి వాళ్లను మారమని చెప్పేవాళ్లు.. ముందు వాళ్లు మారడం బెటర్.