‘మంచు’లో ‘అల్లు’కున్న పరశురాముడు

0సినిమా పరిశ్రమలో సక్సెస్ ఇచ్చే కిక్ ముందు ఏది సాటిరాదు. ఒక్కసారి దాన్ని అందుకుంటే మనకోసం పోటీపడే వాళ్ళను చూస్తే కలిగే ఆనందం అంతా ఇంతా ఉండదు. గీత గోవిందంతో అల్టిమేట్ సక్సెస్ సాధించిన దర్శకుడు పరశురామ్ దీన్ని మనసారా ఆస్వాదిస్తూనే మరోవైపు తనవాళ్ళను అయోమయంలో పడేస్తున్నాడు. ఎందుకంటారా. ఇప్పుడు ఈ దర్శకుడు తమవాడంటే తమవాడంటూ రెండు పెద్ద సంస్థలు రేస్ లో దిగటమే దీనికి కారణం. విష్ణుతో పరశురామ్ సినిమా ఒకటి ఉంటుందని మంచు బ్యానర్ నుంచి వార్త పొక్కిన కాసేపటికే లేదు లేదు గీత ఆర్ట్స్ 2 కోసం మేము అతన్ని మళ్ళి లాక్ చేసుకున్నాం కథా చర్చలు జరుగుతున్నాయని అల్లు కాంపౌండ్ నుంచి బైట్ వచ్చేసింది. ఇందులో ఎవరిది ముందు ఉంటుందో ఖచ్చితంగా ప్రస్తుతానికి చెప్పలేని పరిస్థితి. కానీ మంచు ఫ్యామిలీతో పరశురామ్ అడ్వాన్స్ తీసుకున్న మాట నిజమే అని ఇన్ సైడ్ టాక్. కాకపోతే ఎప్పుడు కమిట్మెంట్ ఇచ్చాడు దానికి కాల పరిమితి ఏంటి అనే వివరాలు తెలియాల్సి ఉంది.

నిజానికి పరశురామ్ శ్రీరస్తు శుభమస్తుతోనే సక్సెస్ ట్రాక్ ఎక్కినప్పటికీ ఇతనిలో స్పార్క్ గుర్తించిన అల్లు అరవింద్ విజయ్ దేవరకొండ డేట్స్ తన వద్ద ఉండటంతో ఆలస్యం చేయకుండా పరశురామ్ చెప్పిన లైన్ నచ్చి చకచకా పట్టాలు ఎక్కించారు. కట్ చేస్తే క్రేజ్ ఉన్న హీరో దొరకడంతో గీత గోవిందం రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతోంది. అర్జున్ రెడ్డిని దాటే అంచనాలు కూడా ట్రేడ్ వేస్తోంది. సో పరశురామ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనే ట్యాగ్ నుంచి స్టార్ డైరెక్టర్ అనే బ్యాడ్జ్ తెచ్చేసుకున్నాడు. ఫ్యామిలీస్ నే కాదు తాను యూత్ ను సైతం మెప్పించే ఎంటర్ టైనర్ ఇవ్వగలను అని గీత గోవిందంతో ప్రూవ్ చేసాడు. ఈ నేపథ్యంలో అల్లు-మంచు ఇలా పోటీ పడటంలో ఆశ్చర్యం లేదు. ఈ గుట్టు విప్పాలి అంటే పరశురామ్ స్వయంగా క్లారిటీ ఇస్తే బెటర్. ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న పరశురామ్ దీని గురించి ఇప్పటికిప్పుడు కాదు కానీ కొద్దిరోజులు అయ్యాక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. చూద్దాం.