బాహుబలి2పై అల్లు అరవింద్ సంచలన కామెంట్స్

0Allu-aravindబాహుబలి2 విజయం ఉత్తరాది సినీ పరిశ్రమకు గుణపాఠం నేర్పేలా ఉందనే అభిప్రాయం ప్రతీ ఒక్కరి నుంచి వ్యక్తమవుతున్నది. దక్షిణాది విషయంలో ఉత్తర భారత ప్రాంతం వాళ్ల చులకన భావం, అధిపత్యం ఎన్నో ఏళ్లుగా ఉన్నది. సినీ పరిశ్రమలో ఉత్తరాది వాళ్ల డామినేషన్ ఎక్కువగానే కనిపించేది. ఈ విషయంపై సాక్షి ఎక్సెలెన్స్ అవార్డు కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు.

సాధారణంగానే ఉత్తర భారతంలోని వారికి దక్షిణాది వారంటే చులకన భావం ఉంటుంది. సినీ పరిశ్రమలో మీరీ ఇది ఎక్కువ. సినీ నిర్మాణాలపరంగా బాహుబలి2 సినిమా ఉత్తరాది వారికి చెంపపెట్టు. తెలుగువాళ్ల సత్తాను చాటిన సినిమా అని అల్లు అరవింద్ అన్నారు. సాక్షి అవార్డుల కార్యక్రమంలో సరైనోడు చిత్రానికి అవార్డులు అందుకొన్న సందర్భంగా అల్లు అరవింద్ ఈ వ్యాఖ్యలు చేశారు.

బాహుబలి2 సృష్టిస్తున్న ప్రభంజనం ఉత్తరాది వారికి.. ముఖ్యంగా బాలీవుడ్ రంగానికి గుణపాఠం. భారతీయ సినిమా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుల ప్రభంజనం సృష్టిస్తున్న బాహుబలిని నిర్మించిన రాజమౌళి నిజంగా అభినందనీయుడు అని అల్లు అరవింద్ ప్రశంసల వర్షం కురిపించాడు.

ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త అధ్యాయం లిఖించిన బాహుబలి టీమ్‌కు అభినందనలు. అలాంటి సినిమాను తీసి ప్రపంచానికి తెలుగువాళ్ల సత్తాను చాటిన రాజమౌళిని కీర్తించే అవకాశం నాకు రావడం నిజంగా అదృష్టం. చాలా గర్వంగా కూడా ఉంది అని అల్లు అరవింద్ అన్నారు.

ఉత్తరాది సినీ పరిశ్రమలో కపూర్లు, ఖాన్‌ల సినిమాలో దేశానికి దిక్కు అనే భావనలో ఉన్నట్టు కనిపించేది. ఇలాంటి అపోహలను బాహుబలి2 పటాపంచలు చేసింది. సినిమా నిర్మాణంలో బాలీవుడ్ కంటే దక్షిణాది వాళ్లు తక్కువేమీ కాదని బాహుబలి2 స్పష్టం చేసింది. త్వరలో రానున్న రోబో2, సంఘమిత్ర, మహాభారతం చిత్రాలు బాలీవుడ్‌పై అధిపత్యం కొనసాగించే అవకాశం ఉంది.