విజయ్ పెద్ద ముదురు.. అరవింద్ షాక్

0టాలీవుడ్ లోకి దూసుకొచ్చిన హీరో విజయ్ దేవరకొండ.. పవన్ కళ్యాణ్ కు మొదట్లో వరుసగా ఎలా బ్లాక్ బస్టర్స్ దక్కాయో అచ్చం అలాగే ఇప్పుడు విజయ్ కు కూడా సక్సెస్ లు వచ్చిపడుతున్నాయి. దీంతో నెటిజన్లంతా మరో వపన్ కళ్యాణ్ అంటూ ట్రోలింగ్స్ తో హోరెత్తిస్తున్నారు. ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ‘గీతగోవిందం’ హిట్ తో విజయ్ నామస్మరణ చేస్తోంది.. ఆదివారం గీతగోవిందం సక్సెస్ మీట్ లో కూడా మెగాస్టార్ చిరంజీవి కూడా విజయ్ ని ప్రశంసల్లో ముంచెత్తాడు..

చిరంజీవి మాట్లాడుతూ.. ‘గీతాగోవిందం హిట్ తో టాలీవుడ్ లో విజయ్ అగ్రనటుల జాబితాలో చేరిపోయినట్లేనని’ స్పష్టం చేశారు. తెలుగు తెరకు మరో స్టార్ హీరో దొరికాడని చిరంజీవి అన్న మాటలు వైరల్ గా మారాయి.. ప్రస్తుతం విజయ్ కు అదృష్టం తలుపుతట్టిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

ఇక పవన్ వారసుడిగా కీర్తిస్తున్న విజయ్ పై ఇదే సక్సెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. విజయ్ దేవరకొండను చిరంజీవితో పోల్చాడు. విజయ్ ఎదురువారు చెప్పేది విని ఆలోచిస్తాడని.. చిరంజీవి కూడా అలానే చేస్తాడని అరవింద్ సంచలన నిజం చెప్పాడు. కానీ విజయ్ చాలా ముదురు అని.. తెలివైనోడు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఇలా విజయ్ ముదురు తెలివైనోడు అని చెప్పిన అరవింద్ మాటలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.