మళ్ళీ ఆర్య కాంబినేషన్

0సుకుమార్ కి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన క్రెడిట్ అల్లు అర్జున్ కి దక్కుతుంది. ఆర్య సినిమాతో తన ట్యాలెంట్ ను చూపించాడు సుకుమార్. దిని తర్వాత ఆర్య 2వచ్చింది వీరి కలయికలో. అయితే ఆర్య 2 డిజాస్ట‌ర్ అయ్యింది. అయినా.. సుక్కు పై వున్న గురి చెడిపోలేదు.

ఇప్పుడు వీరి కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతోంద‌ని స‌మాచారం. రంగ‌స్థ‌లం త‌ర‌వాత సుకుమార్ ఎవ‌రితో సినిమా చేస్తాడన్న‌ది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఆ అవ‌కాశం బ‌న్నీకే ఎక్కువ ఉంద‌ని తెలుస్తోంది. ‘నా పేరు సూర్య’ త‌ర‌వాత అల్లు అర్జున్ కూడా ఖాళీనే. త‌న త‌దుప‌రి సినిమాల గురించి బ‌న్నీ ఇంకా ఓ క్లారిటీకి రాలేక‌పోతున్నాడు. సుక్కుతో ఓ సినిమా చేయాల‌ని బ‌న్నీ భావిస్తున్నాడ‌ని టాక్‌. . ‘రంగ‌స్థ‌లం’ హిట్ట‌యితే… వెంటనే బన్నీ నుండి ఒక ప్రకటన రావచ్చు.