రేపే స్టైలిష్ స్టార్ సినిమా అనౌన్స్ మెంట్

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాస్ట్ సినిమా ‘నా పేరు సూర్య’. ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ అయింది.. అప్పటినుండి బన్నీనెక్స్ట్ సినిమా ప్రకటన కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు గానీ ఇప్పటి వరకూ ఆ ప్రకటన రాలేదు. ఈమధ్యనే త్రివిక్రమ్ తో ప్రాజెక్ట్ ఫైనలైజ్ అయిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక బన్నీ-త్రివిక్రమ్ సినిమా గురించి ఒక అప్ డేట్ బయటకు వచ్చింది.

రేపు దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ గీతా ఆర్ట్స్ సంస్థ బన్నీ సినిమా ప్రకటన ఇవ్వబోతోందని సమాచారం. అలా అని ఈ సినిమా గీతా ఆర్ట్స్ లో నిర్మించే విషయం ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఇంకా ఏ బ్యానర్లో ఈ సినిమాను నిర్మించే విషయం తేలలేదట. బన్నీ ఈ సినిమాను గీతా ఆర్ట్స్ లో నిర్మించాలని అనుకుంటున్నాడు.. మరోవైపు త్రివిక్రమ్ హారిక హాసిని సంస్థలో తప్ప వేరే బ్యానర్ లో సినిమాలు చేయడం లేదు. హారిక హాసిని చినబాబు అంటే అల్లు అరవింద్ కు చాలా అభిమానమని అందుకే ఎవరు నిర్మించేంది తేల్చే విషయంలో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉన్నాడని అంటున్నారు.

ఏదేతెనేం.. రేపు మాత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా ప్రకటన మాత్రం గ్యారంటీ. మిగతా విషయాల్లో క్లారిటీ వచ్చేందుకు కాస్త సమయం పడుతుంది. ‘జులాయి’.. ‘S/o సత్యమూర్తి’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం ఇది. సహజంగానే అంచనాలు భారీగా ఉండే అవకాశం ఉంది.
Please Read Disclaimer