బాలీవుడ్ కు సైసై అంటున్న బన్నీ

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈమధ్య గల్ఫ్ న్యూస్ ట్యాబ్లాయిడ్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మ్యాగజైన్ కు సంబంధించిన ఏప్రిల్ ఎడిషన్ కవర్ పేజిపై కూడా అల్లు అర్జున్ మెరిశాడు. గల్ఫ్ న్యూస్ ఇంటర్వ్యూలో బన్నీ చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. అల్లు అర్జున్ కు సౌత్ లోనే కాకుండా హిందీ డబ్బింగ్ సినిమాల ద్వారా భారీ గుర్తింపే ఉంది. బన్నీ సినిమాలు యూట్యూబ్ లో దుమ్ము లేపుతుంటాయనే సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్ ఎంట్రీ గురించి అడిగారు. దానికి సమాధానం ఇస్తూ తన కంఫర్ట్ జోన్ నుండి బైటకు వచ్చేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటానని.. బాలీవుడ్ సినిమాల్లో నటించే ఆలోచన ఉందని చెప్పాడు.

బిగ్ బాస్ 3 తెలుగు కు మీరు హోస్ట్ గా వ్యవహరిస్తారని రూమర్లు ప్రచారంలో ఉన్నాయి మీరేమంటారు అని అడిగితే.. “నేను.. నాన్నగారు గతంలో మాటీవీ డైరెక్టర్స్ బోర్డ్ లో ఉండేవాళ్ళం. అప్పుడు నాకు బిగ్ బాస్ 1 & 2 లకు హోస్ట్ గా ఆఫర్ వచ్చింది. కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు. అది నా స్పేస్ కాదనిపించింది. ప్రస్తుతం నా ఫోకస్ అంతా సినిమాల మీదే” అన్నాడు. ఈమధ్య మీకు మీ నాన్నగారికి గొడవలని ప్రచారం సాగింది కదా అని అడిగితే “నేను.. నాన్న వాటిని చూసి నవ్వుకున్నాం. ఈమధ్య కాలంలో నేను చదివిన పెద్ద జోక్ అదే. నేను నాన్నతో కలిసి ఒకే ఇంట్లో ఉంటాను. ప్రతి రోజు మేమిద్దరం చాలా టాపిక్స్ మీద మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ వార్తలు విషయం తెలిసి నవ్వుకున్నాం” అన్నాడు.

సుకుమార్ గురించి మాట్లాడుతూ సౌత్ లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్.. వండర్ ఫుల్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరని చెప్పాడు. ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరని చెప్పాడు. మీరు మెథడ్ యాక్టరా లేక స్పాంటేనియాస్ యాక్టరా అని అడిగితే.. “పర్సనల్ గా స్పాంటేనియస్ యాక్టింగ్ ను ఎంచుకుంటా” అని చెప్పాడు. నెపోటిజం గురించి అడిగితే “నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఫిలిం బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చాను. నా విషయంలో నెపోటిజం ఉంది. నేను దాన్ని తప్పించుకోలేను. కానీ ఒక విషయం మాత్రం చెప్పగలను. నెపోటిజం ఉండొచ్చు.. లేకపోవచ్చు.. ఫైనల్ గా ఇండస్ట్రీ లో నిలబడగలిగేవారు టాలెంట్ ఉన్నవారు మాత్రమే” అని కుండబద్దలు కొట్టాడు.

మీరు గూగుల్ చేస్తారా అంటే.. “అవును.. అప్పుడప్పుడూ సెర్చ్ చేస్తుంటాను. ప్రతి సినిమాలో కొత్తగా ఉండేందుకు ట్రై చేస్తుంటాను. అందుకే పాత సినిమాలలో నా లుక్స్ ను రెఫర్ చేస్తుంటాను” అన్నాడు. ట్రోలింగ్ గురించి ఆడిగితే “ట్రోలింగ్ తో నాకేమీ ప్రాబ్లెం లేదు. ప్రతి ఒక్కరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. అది వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ నన్ను ఇబ్బంది కలిగించే అంశం మాత్రం ‘భాష’. మర్యాదపూర్వకమైన భాషలో విమర్శలు చేస్తే ఓకే కానీ భాష సరిగా లేనప్పుడు విమర్శకు అర్థం ఉండదని నేను నమ్ముతాను అన్నాడు.
Please Read Disclaimer