బన్ని ‘డాడి’ స్టెప్పుకు 17 ఏళ్లు

0

బన్ని హీరో అయ్యింది `గంగోత్రి` చిత్రంతో. 2003లో ఈ సినిమా రిలీజైంది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిక్కరుతో కనిపించి ఒక సాధాసీదా బోయ్ గా ఎంతో సహజంగా నటించాడు. వాస్తవానికి అల్లు అర్జున్ రెండేళ్ల వయసు బాలకుడిగా ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి- కోదండరామిరెడ్డి కాంబినేషన్ మూవీ `విజేత`లో అప్పియరెన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత 2001లో మెగాస్టార్ చిరంజీవి `డాడి` చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ తో ఆకట్టుకున్నాడు. అప్పటికి నూనూగు మీసాల యువకుడిగా అథ్లెటిక్ లుక్ తో బన్ని ఇచ్చిన ఎంట్రీ అందరినీ ఆకర్షించింది. వెస్ట్రన్ యంగ్ బోయ్స్ తరహాలో బన్నిచేస్తున్న అథ్లెటిక్ డ్యాన్సుల్ని మెచ్చుకుంటూ చిరు చెప్పే డైలాగ్ బన్ని అభిమానులకు ఇప్పటికీ గుర్తుంటుంది.

అప్పటికి ఇప్పటికి బన్నిలో ఎంత మార్పు? నేడు టాలీవుడ్ సహా ఇండియా వైడ్ రికగ్నిషన్ ఉన్న స్టార్ గా అవతరించాడు. బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లు తేగలిగే స్టార్ డమ్ ని సొంతం చేసుకున్నాడు. బన్ని స్టైలిష్ డ్యాన్సింగ్ డెబ్యూ ఇచ్చిన `డాడి` సినిమా రిలీజై ఏకంగా 17 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఆ యూట్యూబ్ లింక్ ను షేర్ చేస్తున్నారు. నేడు సౌత్ ఇండస్ట్రీలోనే డ్యాన్సింగ్ స్టార్ గా – స్టైలిష్ స్టార్ గా తనని తాను ఆవిష్కరించుకున్న బన్ని ఎప్పుడూ తన మూలాల్ని మర్చిపోడు. తాత అల్లు రామలింగయ్య అంటే బన్నికి ఎంతో ఇష్టం – అభిమానం. అందుకే మొన్నటికి మొన్న ఆయన ఘాట్ వద్ద ప్రార్థనలు చేస్తూ కనిపించాడు. మెగాస్టార్ చిరంజీవి అనే వృక్షం కింద సేద దీరే బాటసారులం మేమంతా! అని వినమ్రంగా చెబుతాడు బన్ని. తాను ఎంత ఎత్తుకు ఎదిగినా మావయ్య అంటే ప్రేమాభిమానాలతో కూడుకున్న గౌరవాన్ని ప్రదర్శిస్తుంటారు. చిరు బాటలోనే క్రమశిక్షణను అలవాటు చేసుకుని తాను ఇంత ఎదిగానని గర్వంగానే చెప్పుకుంటాడు.

ఇండస్ట్రీలో ఎవరికీ లేని అదృష్టం తనకు మాత్రమే ఉందని అల్లు అరవింద్ అనే బాస్ తనకు డాడ్ గా ఉండడం వల్లనే ఇదంతా సాధ్యమైందని చెబుతాడు. తాను ఏ ప్రయోగాలు చేసేందుకైనా తన తండ్రి అండదండలు ఉపకరిస్తాయన్న ధీమాని కెరీర్ ఆరంభమే వ్యక్తపరిచారు బన్ని. ప్రస్తుతం టాలీవుడ్లోనే ప్రయోగాత్మక కథల్ని ఎంచుకుని సాహసాలు చేసే హీరోగానూ బన్నికి పేరుంది. విలక్షణత వైవిధ్యం తన ప్రత్యేకత అని బన్ని నిరూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. గత చిత్రం `నా పేరు సూర్య` విఫలమైనా – ప్రస్తుతం ఓ కమర్షియల్ విజయంతో ట్రాక్ లోకి తెచ్చే కథ కోసం అన్వేషిస్తున్నాడు. ఇప్పటికి అతిధి పాత్రలు కలుపుకుని 25 సినిమాల్లో నటించాడు మన స్టైలిష్ స్టార్.
Please Read Disclaimer