ఈ రోజే అల్లు అర్జున్ డీజే ట్రైలర్..!

0


DJ - Duvvada Jagannadham-Trailerఅల్లు అర్జున్, హరీష్ శంకర్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా ట్రైలర్ ఈ రోజే(సోమవారం) రిలీజ్ కానుంది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాల ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ల రిలీజ్లను చాలా ముందుగానే ప్రకటిస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ డీజే మాత్రం అలా ముందుగా ప్రకటించకుండా కేవలం కొన్ని గంటల ముందే ట్రైలర్ రిలీజ్ను ఎనౌన్స్ చేసింది.

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాపై ట్రైలర్ను ఈరోజు సాయంత్ర ఏడున్నరకు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు దర్శకుడు హరీష్ శంకర్. బన్నీ బ్రహ్మాణుడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన సాంగ్ టీజర్ వివాదాస్పదం కావటంతో ట్రైలర్ పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.