అతడు, అదుర్స్‌ మిక్సీలో వేస్తే దువ్వాడ?

0Duvvada-Jagannadham‘దువ్వాడ జగన్నాథమ్‌’ ఎలా వుంటుందనేది టీజర్‌లోనే క్లారిటీ ఇచ్చేసాడు హరీష్‌ శంకర్‌. బ్రాహ్మణుడి గెటప్‌లో అమాయకంగా కనిపిస్తూ అల్లు అర్జున్‌ బాగా కామెడీ చేస్తాడని, అలాగే అతడికి మరో యాంగిల్‌ కూడా వుందని టీజర్‌లో చూపించేసారు. ఇంతకీ అల్లు అర్జున్‌కి ఇందులో వున్న ఆ మరో కోణం ఏమిటంటే, అతనో కాంట్రాక్ట్‌ కిల్లర్‌ అట. ఇంగ్లీష్‌లో హిట్‌మ్యాన్‌ అంటారు.

అతడు సినిమాలో మహేష్‌బాబు చేసాడు కదా, అలాంటి రోల్‌ అన్నమాట. హిట్‌మ్యాన్‌ అయిన అల్లు అర్జున్‌ తన ఐడెంటిటీ దాచుకుని ‘దువ్వాడ జగన్నాథమ్‌’గా అగ్రహారంలో చేరి అండర్‌ కవర్‌లో తన పని కానిచ్చేస్తూ వుంటాడు. అతను ఇలా గుట్టుగా ఉండడానికి వెనుక బలమైన కారణమే వుంటుందట. అదుర్స్‌లో చారి క్యారెక్టర్‌ని, అతడులో పార్థు క్యారెక్టర్‌ని మిక్స్‌ చేసి హరీష్‌ శంకర్‌ ఒక కొత్త రకం కమర్షియల్‌ ట్రీట్‌మెంట్‌ సిద్ధం చేసాడట.

దువ్వాడ జగన్నాథమ్‌ తెరకెక్కిన విధానం చూసిన దిల్‌ రాజు తన బ్యానర్లో బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుందని చెబుతున్నాడట. కొన్ని ప్రధాన ఏరియాలకి రైట్స్‌ కావాలంటూ బయ్యర్లు వెంట పడుతున్నా కానీ స్వయంగా రిలీజ్‌ చేసుకుందామని రైట్స్‌ కూడా అమ్మనంటున్నాడట. అతని కాన్ఫిడెన్స్‌ చూసి బయ్యర్లలో దువ్వాడ పట్ల మరింత క్రేజ్‌, డిమాండ్‌ పెరిగిపోయింది.