200 మిలియన్స్ లేవు..ఇప్పుడు 1.5 మిలియన్సే!

0యూట్యూబ్ లో ఏమౌతుందో ఏంటో ఒక్కోసారి యూట్యూబ్ చానల్స్ వాళ్లకి కూడా అర్థం కాదు.. ఇక వ్యూయర్స్ సంగతి చెప్పనవసరం లేదు. ఈమధ్య అల్లు అర్జున్ సినిమా సరైనోడు హిందీ వెర్షన్ 200 మిలియన్ వ్యూస్ సాధించింది. అది కూడా చాలా తక్కువ సమయంలో. ఇప్పటివరకూ అన్ని మిలియన్ వ్యూస్ సాధించిన సినిమా ఇండియాలో మరేదీ లేకపోవడంతో చాలా హంగామా జరిగింది. కానీ జస్ట్ రెండు రోజుల్లో పరిస్థితి తల్లకిందులైంది.

కాపీ రైట్స్ ఇష్యూ అంటూ – ఆ హిందీ వెర్షన్ ను సదరు యూట్యూబ్ ఛానల్ నుండి తొలగించింది యూట్యూబ్ యాజమాన్యం.  గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినా మళ్ళీ అవే వ్యూస్ ను తిరిగి ఉంచారు.. దాంతో ఫ్యాన్స్ అందరూ అలానే జరుగుతుందని ఆశించారు. కానీ అలా జరగలేదు. దాంతో గోల్డ్ మైన్ టెలిఫిలిమ్స్ వారు మళ్ళీ తమ ఛానల్ లో సరైనోడు హిందీ సినిమాను జూలై 24 న అప్ లోడ్ చేశారు.   ఇప్పటికి మళ్ళీ సినిమా వ్యూస్ 1.5 మిలియన్ టచ్ అయ్యాయి. 

దీంతో ‘సరైనోడు’ సృష్టించిన 200 మిలియన్ వ్యూస్ రికార్డు ఇక లేనట్టే. ఇది అభిమానులకు నిరాశ కలిగించే విషయమే అయినా రెండు రోజుల్లో మళ్ళీ 1.5 మిలియన్ వ్యూస్ రావటంతో త్వరలో మళ్ళీ ఆ రికార్డును త్వరలో సొంతం చేసుకుంటామని అంటున్నారు.  చూద్దాం ఏం జరుగుతుందో.