బెనిఫిట్ షోస్ వద్దనేసిన బన్నీ

0


DJ-Benefit-Showsటాలీవుడ్ లో బెనిఫిట్ షోస్ కల్చర్ ఎప్పటి నుంచో ఉంది. మిగిలిన ఆడియన్స్ కంటే ముందే తమ హీరో సినిమాను చూసేయాలన్న ఫ్యాన్స్ ఆతృత నుంచి మొదలైన ఈ బెనిఫిట్ షోస్.. ఇప్పుడు రూపాంతరం చెందాయి. యాంటీ ఫ్యాన్స్ కు ఓ ఆయుధం అయిపోయాయి కూడా. ప్రస్తుతం ప్రీమియర్స్ ప్రదర్శించే థియేటర్లలో ఫ్యాన్స్ తో సమానంగా యాంటీ ఫ్యాన్స్ కనిపిస్తున్నారు.

ఆయా సినిమాల్లో ఉండే లోపాలను విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసేస్తూ.. వీలైనంత ఎక్కువగా మూవీని డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది కలెక్షన్స్ పై బాగానే ఎఫెక్ట్ చూపిస్తోంది. ఈ విషయంలో డీజే టీం.. ముఖ్యంగా అల్లు అర్జున్ బాగా ఎలర్ట్ గా ఉన్నాడు. దువ్వాడ జగన్నాధం మూవీకి బెనిఫిట్ షోస్ ప్రదర్శించవద్దని.. ముందు రోజు షోస్ అసలు ఉండొద్దని నిర్మాత దిల్ రాజుకు సూచించాడట. ఒకట్రెండు షోస్ కు వచ్చే కలెక్షన్స్ కోసం ప్రదర్శించినా.. ఇది సినిమా కలెక్షన్స్ పై ప్రభావం పడుతుండడాన్ని చూపాడట బన్నీ. సరైనోడు సినిమా టైంలో కూడా ఎక్కడా బెనిఫిట్ షోస్ పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు అల్లు అర్జున్

ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం.. నైజాంలో ఎక్కడా బెనిఫిట్ షోస్.. ప్రీమియర్ షోస్ ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే.. మిగిలిన ఏరియాల్లో మాత్రం ఉదయం 6నుంచి షోస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జూన్ 23న డీజే రిలీజ్ కానుండగా.. ముందు రోజే యూఎస్ లో ప్రీమియర్స్ ప్రదర్శించడం మాత్రం ఖాయమే.