గల్ఫ్ మ్యాగజైన్ పై స్టైలిష్ స్టార్

0

అల్లు అర్జున్ కు ఇచ్చిన బిరుదే ‘స్టైలిష్ స్టార్’. ఇక అయన స్పెషాలిటీనే స్టైల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ప్రతి సినిమాకు తన లుక్ ను మార్చుకోవడంతో పాటు ట్రెండీ స్టైల్స్ ను ఫాలో కావడం బన్నీకి వెన్నతో పెట్టిన విద్య. ఇక బన్నీకి తెలుగు రాష్ట్రాల బయట ఉన్న ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా అందరికీ తెలిసిందే. ఈసారి మన స్టైలిష్ స్టార్ ఏకంగా గల్ఫ్ న్యూస్ ట్యాబ్లాయిడ్ కవర్ పేజిపై మెరిశాడు.

జస్ట్ కవర్ పేజి పై మెరవడమే కాదు.. ఆ మ్యాగజైన్ ఏప్రిల్ ఎడిషన్లో బన్నీపై ఒక ఎక్స్ క్లూజివ్ కథనాన్ని కూడా ప్రచురించింది. ఈ కథనానికి వారు ఇచ్చిన టైటిల్ ‘ఐ ఆన్ ది ప్రైజ్’. మనం రఫ్ గా అనువాదం చేసుకుంటే ‘టార్గెట్ పై కన్నేశాడు’ అని అర్థం. మరి టార్గెట్ ఏంటి? కవర్ పేజిలో ఈ టైటిల్ కిందే “తెలుగు సూపర్ స్టార్ అల్లు అర్జున్ తన కంఫర్ట్ జోన్ వదిలి తెలియని గమ్యం వైపు పయనిస్తున్నారు.. బాలీవుడ్ ను కూడా ఆయన పరిశీలిస్తున్నారు” అని ఉంది. దీనర్థం మన స్టైలిష్ స్టార్ బాలీవుడ్ జర్నీకి రెడీ అయినట్టే.

ఈ మ్యాగజైన్ కవర్ పేజి ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన అల్లు అర్జున్ “థ్యాంక్ యూ @గల్ఫ్ న్యూస్ ట్యాబ్లాయిడ్ @గల్ఫ్ న్యూస్” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఫోటోలో బన్నీ స్టైల్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. బ్లూ కలర్ బ్లేజర్ లో సూపర్ డూపర్ హ్యాండ్ సమ్ గా ఉన్నాడు. ఈ ఫోటోకు ఇన్స్టా లో భారీ రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది నెటిజనులు ‘బన్నీ అన్నా.. నీ బాలీవుడ్ డెబ్యూ కోసం వెయిటింగ్’ అని కామెంట్స్ కూడా పెట్టారు.

సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈమధ్యే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఈ సినిమాను వీలైంత త్వరగా పూర్తి చేసి ఆరు నెలల్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలలో ఉన్నారట.
Please Read Disclaimer