దానికి తీరిక లేదంటున్న బన్నీ

0

ఉత్తరాధిన సూపర్ హిట్ అయిన హింది బిగ్ బాస్ ను తెలుగులో ఇప్పటికే రెండు సీజన్ లు పూర్తి చేసిన విషయం తెల్సిందే. మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా రెండవ సీజన్ కు నాని హోస్టింగ్ చేశాడు. రెండు సీజన్ లు కూడా మంచి టీఆర్పీ రేటింగ్ ను దక్కించుకున్నాయి. ఈ రెండు సీజన్ లు మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో మూడవ సీజన్ ను మరింత ఆసక్తికరంగా ఆకట్టుకునే విధంగా తీసుకు వచ్చేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు మరియు స్టార్ మా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలోనే వారు మూడవ సీజన్ కు హోస్ట్ కోసం పలువురు స్టార్స్ తో చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వచ్చాయి వస్తూనే ఉన్నాయి.

బిగ్ బాస్ టీం చర్చలు జరిపిన వారిలో అల్లు అర్జున్ కూడా ఉన్నాడంటూ ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ మూడవ సీజన్ కు హోస్టింగ్ చేసేందుకు ఓకే చెప్పాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా అల్లు అర్జున్ ఆ విషయమై క్లారిటీ ఇచ్చాడు. బిగ్ బాస్ మొదటి సీజన్ ప్రారంభంకు ముందు నా వద్దకు హోస్టింగ్ చేయమంటూ వచ్చారు. కాని నేను ఆ సమయంలో సినిమాలతో చాలా బిజీగా ఉన్న కారణంగా నో చెప్పాను. ఆ తర్వాత రెండవ సీన్ కు కూడా సంప్రదించారు. నేను బిజీగా ఉండటం వల్ల రెండు సీజన్ లను వారు చేశారు. ఇప్పుడు మూడవ సీజన్ కు మీరు చేస్తున్నారా అంటూ ప్రశ్నించగా బిగ్ బాస్ చేసేంత తీరిక నాకు లేదు అంటూ బన్నీ సమాధానం ఇచ్చాడు.

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక చిత్రంను చేస్తున్నాడు. దాదాపు సంవత్సరం గ్యాప్ తీసుకున్న బన్నీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. త్రివిక్రమ్ మూవీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో బన్నీ మూవీ ఉంటుంది ఆ వెంటనే దిల్ రాజు బ్యానర్ లో ఒక చిత్రంను చేసేందుకు బన్నీ ఓకే చెప్పాడు. ఈ మూడు సినిమలు కూడా సంవత్సరం గ్యాప్ లోనే ప్రేక్షకుల ముందుకు వస్తాయని తెలుస్తోంది.
Please Read Disclaimer