అల్లు అర్జున్ కు అతడి కథే నచ్చింది

0స్టార్ హీరోల్లో అందునా మెగా ఫ్యామిలీలో గ్యాప్ లేకుండా చకచకా సినిమాలు చేసుకుంటూ పోయే హీరో అల్లు అర్జున్. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా కోసం కెరీర్ లో ఎప్పుడూ పడనంత కష్టాన్ని పడ్డాడు. ఎంత శ్రమకోర్చి చేసిన సినిమా ఫలితం నెగిటివ్ గా రావడం బన్నీని కాస్త నిరాశపరిచింది.

అల్లు అర్జున్ తన తరవాత సినిమా ఏంటన్న దానిపై ఇంతవరకు ఓ డిసిషన్ తీసుకోలేదు. ఇప్పటికి అయిదారుగురు డైరెక్టర్లు స్టోరీ లైన్ చెప్పినా అవేవీ బన్నీని పెద్దగా ఇంప్రెస్ చేయలేదట. అందుకే గ్యాప్ వచ్చినా ఫర్వాలేదన్న కాన్సెప్ట్ తో నచ్చే సబ్జెక్టు కోసం చూస్తున్నాడు. అతడితో తరవాత సినిమా చేయడానికి డైరెక్టర్లు విక్రమ్ కె కుమార్ – హరీష్ శంకర్ – వి.ఐ. ఆనంద్ ఇంట్రస్టింగ్ గా ఉన్నారు. వీరందరి దగ్గర స్టోరీ లైన్ రెడీగా ఉంది. వీటిలో అల్లు అర్జున్ విక్రమ్ కె. కుమార్ రెడీ చేసిన స్టోరీయే నచ్చిందని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం విక్రమ్ కె. కుమార్ డైలాగ్ వెర్షన్ తో సహా స్క్రిప్ట్ రెడీ చేశాడు. బన్నీ ఇందులో కొన్నిఛేంజెస్ సూచించడంతో ఆ మేరకు మార్పుచేర్పులు చేసే పనిలో విక్రమ్ ఉన్నాడని తెలిసింది. విక్రమ్ కెరీర్ లో చేసినవి తక్కువ సినిమాలే అయినా సరికొత్త కాన్సెప్ట్ తో ఉంటాయి. ఈ స్క్రిప్ట్ కూడా బన్నీ ఓకే చేయడానికి అదే కారణమట. డి.వి.వి. దానయ్య వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నాడు.