అల్లు అర్జున్ కోసం ఆ ఇద్దరు..

0నా పేరు సూర్య తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రేపు థియేటర్స్ లలో సందడి చేయబోతున్నాడు. ఈ చిత్రం తర్వాత ఎవరితో చేస్తాడనే ఆత్రుత అందరిలో నెలకొనింది. ప్రస్తుతం ఇద్దరి డైరెక్టర్ల పేర్లు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే భరత్ అనే నేను తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కొరటాల శివ కాగా మరొకరు మనం , 24 వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన విక్రమ్ కుమార్ ల పేర్లు వినిపిస్తున్నాయి. మరి అల్లు అర్జున్ మనసులో ఏ డైరెక్టర్ తో చేయాలనీ ఉందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

ఇక నా పేరు సూర్య విషయానికి వస్తే..స్టార్ రైటర్ గా పేరున్న వక్కంతం వంశీ మొదటిసారి ఈ మూవీ తో డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు. దేశ భక్తి నేపథ్యం లో ఈ మూవీ తెరకెక్కగా , బన్నీ కి జోడిగా అను ఇమ్మానుయేల్ నటించింది. ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. మరి సూర్య ఏం చేస్తాడో చూడాలి.