అల్లు అర్జున్‌ మళ్ళీ కొట్టేసాడు

0Sarainoduత్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ఒక్క సినిమా చేయాలని రామ్‌ చరణ్‌ తహతహలాడిపోతున్నాడు. ఏం చేసి అయినా త్రివిక్రమ్‌ డేట్స్‌ సంపాదించాలని అక్కినేని క్యాంప్‌ చేయని ప్రయత్నం లేదు. అఖిల్‌ సినిమా అతని చేతిలో పెట్టాలనేది నాగార్జున కోరిక. అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా చాలా కాలం నుంచి త్రివిక్రమ్‌తో వర్క్‌ చేయడానికి ఎదురు చూస్తున్నాడు.

మహేష్‌, పవన్‌ అభిమానులు మళ్లీ తమ హీరోతో త్రివిక్రమ్‌ సినిమా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. వీరందరినీ కాదని నెక్స్‌ట్‌ సినిమా తమిళ హీరో సూర్యతో చేద్దామని డిసైడైన త్రివిక్రమ్‌ అది మొదలు పెట్టేలోగా అల్లు అర్జున్‌తో ఒకటి లాగించేయబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. సరైనోడు తర్వాత వెంటనే ఈ చిత్రం మొదలు పెట్టేలా బ్యాక్‌గ్రౌండ్‌లో అల్లు అర్జున్‌ ప్లాన్‌ చేసుకున్నాడట. త్రివిక్రమ్‌ నో చెప్పలేని ఒక ఫిగర్‌ చెప్పి, అతనితో కమిట్‌ చేయించాడట. అన్నీ కుదిరితే ఈ చిత్రం మే నెలలోనే సెట్స్‌ మీదకి వెళుతుందట. ఈ చిత్రాన్ని కూడా గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ నిర్మించబోతున్నారని సినీ వర్గాల సమాచారం.