హీరోయిన్ల నడుములపై బన్నీ హాట్ కామెంట్స్!

0allu arjun opinion about awardsదువ్వాడ జగన్నాథమ్ థియేటర్లకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. దీంతో హీరో అల్లు అర్జున్ సినిమాకు సంబంధించి ప్రమోషన్ బాగానే చేస్తున్నాడు. ఇందులో భాగంగా పలు టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. సాధారణంగా చాలా ఇంటర్వ్యూల్లో సినిమాలకు సంబంధించిన విశేషాలే చెప్పుకొంటూ వచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ మాత్రం అల్లు అర్జున్ కు ఓ టిపికల్ ప్రశ్నే వేసింది. హీరోల్లో స్టైల్ కు ఐకాన్ గా పేరు తెచ్చుకున్న మీరు హీరోయిన్ల స్టైల్ లో ఎవరు నచ్చుతారని అడగ్గా బన్నీ దీనికి మతిపోగొట్టే ఆన్సరిచ్చాడు.

‘‘శారీస్ లో తమన్నా అద్భుతంగా ఉంటుంది. చీరకట్టులో ఆమె నడుము ఒంపులు చూస్తే అదరహో అనాల్సిందే. రచ్చ సినిమాలో ఆమెను చూస్తే మతిపోయింది’’ అంటూ కితాబిచ్చేశాడు. ఇక నాజూకు సుందరి ఇలియానా వెస్ట్రన్ అవుట్ ఫిట్ లో చాలా బాగుంటుంది. అలాంటి డ్రస్సుల్లో ఆమె నడుము ఎక్స్ పోజ్ చేస్తే చూడచక్కగా ఉంటుందని చెప్పాడు. సమంత అయితే అటు వెస్ట్రన్ వేర్ లో… ఇటు ఎథ్నిక్ వేర్ లోనూ ఆకట్టుకోగదు. కాజల్ కూడా వెస్ర్టన్ వేర్ లో చూడచక్కగా ఉంటుంది అని బన్నీ ఓపెన్ గా ఒపీనియన్ పంచుకున్నాడు. స్క్రీన్ పై లేటెస్ట్ గా జతకట్టిన పూజా హెగ్డే గురించి చెబుతూ చాలామందికి షార్ట్ డ్రస్సులు నప్పవు. పూజా పొడుగుకాళ్ల సుందరి కాబట్టి ఆమె షార్ట్ డ్రస్సుల్లోనూ అదరగొట్టేస్తుందని చెప్పాడు.

ఈమధ్య ఆడవాళ్ల గురించి కామెంట్ చేసి చలపతిరావు పరువు బాగా పోగొట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆడవాళ్ల గురించి మాట్లాడేటప్పుడు అంతా ఆచితూచి మాట్లాడుతున్నారు. అలాగే ఆలీ కూడా సమంత నడుమును బెంజ్ సర్కిల్ తో పోల్చి పెద్ద వివాదానికి తెరలేపాడు. ఇప్పుడు బన్నీ హీరోయిన్ల నడుము ఒంపుల గురించి మాట్లాడేశాడు. స్టైల్ అండ్ ఫ్యాషన్ అప్పీల్ గురించి అడగ్గా మనోడు ఇలా చెప్పినా కూడా.. దీనిని జనాలు ఎలా అర్ధంచేసుకుంటారో చూడాలి.