స్టైలిష్ స్టార్ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

0Allu-Arjun-in-DJస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దువ్వాడ జగనాథం. సరైనోడు మూవీ తర్వాత బన్నీ చేస్తున్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే బన్నీ తన తదుపరి చిత్రానికి సంబంధించి సన్నాహాలు చేసుకుంటున్నట్టు టాక్. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారి సినిమాను తెరకెక్కించాలనుకున్న సంగతి తెలిసిందే. ఈ కోవలో రీసెంట్ గా బన్నీని కలిసి స్టోరీ లైన్ తో పాటు ఆయన క్యారెక్టర్ ని నరేట్ చేశాడట వక్కంతం. ఇది అల్లు అర్జున్ కి బాగా నచ్చడంతో వీలైనంత మేరకు త్వరలోనే పట్టాలెక్కించాలని భావిస్తున్నాడట. అయితే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు అయ్యాయని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం వక్కంతం వంశీ ఈ సినిమా కోసం ‘నా పేరు సూర్య .. మన ఊరు ఇండియా’ అనే టైటిల్ ని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించాడని వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది.