మళ్ళీ మొదటికొచ్చిన బన్నీ స్టొరీ!

0స్టార్ లీగ్ లో ఉన్న టాలీవుడ్ హీరోలలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళ్ళే హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. అంతే కాదు మోస్ట్ బ్యాంకబుల్ హీరో కుడా బన్నీనే. కానీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ దెబ్బకు కన్ఫ్యూషన్ లో పడ్డాడని చాలా రోజుల నుండి అంటున్నారు. ఎలాంటి సినిమా చేయాలో తేల్చుకోలేక తికమక పడుతున్నాడని అన్నప్పటికీ విక్రమ్ కుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా వార్తలు వచ్చాయి.

సెకండ్ హాఫ్ స్టొరీ విషయంలో బన్నీ సంతృప్తిగా లేకపోవడంతో విక్రమ్ దాన్ని మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చేందుకు వర్క్ చేస్తున్నాడని అన్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం అసలు ఆ స్టొరీ ని పూర్తి గా పక్క పెట్టేశారట. విక్రమ్ బన్నీ ని మెప్పించేందుకు కోసం వేరే స్టొరీ మీద వర్క్ చేయడం మొదలు పెట్టాడట. విక్రమ్ టాలెంటెడ్ ఫిలింమేకర్ అయినా ఇప్పటివరకూ భారీ బ్లాక్ బస్టర్ ను డైరెక్ట్ చెయ్యలేదు. దీంతో బన్నీ కూడా వేరే డైరెక్టర్ తో చేసే ఆలోచనలో ఉన్నాడట. టాప్ లీగ్ డైరెక్టర్లు అందరూ బిజీగా ఉండడంతో ఒక యూత్ ఫుల్ డైరెక్టర్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట.

మరి ఇది యువ దర్శకులకు మంచి అవకాశమే. బన్నీ ని మెప్పిస్తే ఒక భారీ ప్రాజెక్ట్ ను పట్టినట్టే. మరి ఈ అల్లువారబ్బాయికి ఎవరికి ఆ అవకాశం ఇస్తాడో తెలియాలంటే ప్రేక్షకులు కూడా మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.. అంతలోపు బన్నీ సూపర్ హిట్ సినిమాలను టీవీలోనో యూట్యూబ్ లోనో చూస్తూ TRP లు – వ్యూస్ ను పెంచండి.