హిట్టు ఎన్టీఆర్ కైతే రిలీఫ్ బన్నీకి..!

0

‘అరవింద సమేత’ విజయం అందరికంటే ఎక్కువగా ఎవరికీ అవసరం? తప్పనిసరిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కే. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎన్టీఆర్ ఎలాగూ వరస హిట్లమీద ఉన్నాడు. నెక్స్ట్ సినిమా ఏమో రాజమౌళి ప్రాజెక్ట్. సో.. ఎన్టీఆర్ కి ఈ సినిమా ఫలితం పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. కానీ ‘అజ్ఞాతవాసి’ పరాజయం ఆడియన్స్ నే కాకుండా గురూజీ ఫ్యాన్స్ ను కూడా షాక్ కు గురిచేసింది. త్రివిక్రమ్ ఇలా కూడా సినిమా తీయగలడా అనే కొత్త అనుమానాలు వచ్చాయి. కాబట్టి త్రివిక్రమ్ కు ‘అరవింద సమేత’ సక్సెస్ చాలా ఇంపార్టెంట్.

కానీ త్రివిక్రమ్ కంటే కూడా ఈ సినిమా రిజల్ట్ గురించి ఆసక్తిగా ఎదురుచూసింది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని టాక్. ‘డీజే’ తోనే అల్లు అర్జున్ కు కాస్త బాక్స్ ఆఫీస్ హీట్ తగిలింది కానీ లాస్ట్ సినిమా ‘నాపేరు సూర్య’ ఫ్లాప్ కావడంతో పూర్తిగా డిఫెన్స్ లో పడ్డాడు. ఇప్పుడు మరో ఫ్లాప్ ను ఇస్తే మార్కెట్ కూడా తగ్గే పరిస్థితి ఉండడంతో నెక్స్ట్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. విక్రమ్ కుమార్ ప్రాజెక్ట్ తో రిస్క్ తీసుకునే పరిస్థితి లేకపోవడడం.. ఇతర స్టార్ డైరెక్టర్లందరూ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో బన్నీ కి మిగిలిన బెస్ట్ ఆప్షన్ త్రివిక్రమ్ మాత్రమే. కానీ ‘అజ్ఞాతవాసి’ ఫలితంతో వెంటనే ఆ డెసిషన్ తీసుకోలేకపోయాడు. ఇప్పుడు ‘అరవింద సమేత’ ఓపెనింగ్స్.. సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత త్రివిక్రమ్ ఫామ్ లో ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకున్నాడు.

దీంతో ఇప్పటికే నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో అల్లు అర్జున్ నుండి త్రివిక్రమ్ కు కాల్ వెళ్లిందని సమాచారం. త్రివిక్రమ్ తన వద్ద కథ రెడీగా లేదని ఒకసారి లైన్ రెడీ అయ్యాక మాట్లాడతానని చెప్పాడట. కొంత టైమ్ కావాలని అడిగాడట. ఇక దాదాపుగా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్టే. ఏదేమైనా అరవింద విజయం బన్నీ ఫ్యాన్స్ కు కూడా పెద్ద రిలీఫే.
Please Read Disclaimer