బన్నీ.. టైమ్ బ్యాడ్

0Allu-Arjun-and-Kamal-Haasanకాలి మీద కాలు వేసుకోవడం అనేది ఇంగ్లీషోల్లు మనకు అలవాటు చేసిన ఒక పోష్ కల్చర్. అక్కడి నుండి దానిని మనం రాజసం ఉట్టిపడటం కోసం చూపించే ఒక గెస్చర్ లా ఫీలైపోతుంటాం. ఇప్పుడు అలాంటి ఫోజే స్టయిలిష్ స్టార్ కూడా ఇచ్చాడు. అదివ్వడం తథ్యం.. సోషల్ మీడియాలో రచ్చ మొదలైపోయింది. జనాలు ట్రోలింగ్ తో చుక్కలు చూపించేశారు.

తమిళనాడుకు చెందిన ‘తమిళ తలైవాస్’ అనే కబడ్డి జట్టును రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ కొనుక్కున్నారు. ప్రో కబడ్డీ లీగ్ లో ఆడనున్న ఈ టీమ్ కు కమల్ హాసన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నారు. ఈ లాంచింగ్ కార్యక్రమం నిన్న చెన్నయ్ లో జరిగిన సందర్బంలో.. అక్కడ స్టేజీ మీద లెజండరీ కమల్ హాసన్.. రామ్ చరణ్ తదితరులు మామూలుగా కూర్చుంటే.. బన్నీ మాత్రం కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. అదిగో అక్కడ కమల్ కూడా మామూలుగా కూర్చుంటే.. నువ్వు మాత్రం ఆయన ముందే స్టయిల్ కొడతావా అంటూ తమిళ ఫ్యాన్స్ మనోడ్ని ట్రోల్ చేసిపాడేశారంతే. ఆ సమయంలో బన్నీ ఇవన్నీ థింక్ చేసి ఉండడు కాని.. పబ్లిక్ ఈవెంట్లలో ఇలాంటి కాంట్రోవర్శీలు జాగ్రత్తగా చూసుకోవలయ్యా సరైనోడా.

ఇకపోతే ఈ మధ్యకాలంలో బన్నీ ఏం చేసినా కూడా అదేదో రాక్ స్టార్ సినిమాలో రణబీర్ కపూర్ తరహాలో.. అంతా నెగెటివ్ నెగెటివ్ అన్నట్లే నడుస్తోంది. డిజె సందర్భంగా చేసిన కామెంట్లు.. ఆ సినిమా కలక్షన్లు.. ఆ తరువాత అనేక కామెంట్లు.. అన్నీ కూడా నెగెటివ్ గానే నడుస్తున్నాయి. కేర్ఫుల్ బన్నీ!!