బన్నీతో విక్రమ్ .. ఫిక్స్

013 బి, ఇష్క్‌, మ‌నం, 24…. ఇలా ఒక క‌థ‌కీ మ‌రో క‌థ‌కీ లింకు లేకుండా సినిమాలు తీశాడు విక్రమ్ కె.కుమార్‌. అక్కినేని మూడు త‌రాల హీరోల్ని ఒకే వేదిక‌పైకి తీసుకొచ్చిన మ‌నం సినిమా అయితే ఒక క్లాసిక్ గా నిలిచి పోయింది. ఇటీవల అక్కినేని హీరో అఖిల్ తో ‘హలో’ తీశాడు. . ఇప్పుడు అల్లు అర్జున్‌ కోసం ఓ కథ సిద్ధం చేశారని తెలుస్తోంది.

ఇటీవల ఈ కథ బన్నీకి వినిపించడం, ఆయన ‘ఓకే’ చెప్పేయడం జరిగిపోయాయని సమాచారం. అల్లు అర్జున్‌ నటించిన ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ తరవాత… విక్రమ్‌ సినిమాని పట్టాలెక్కించే అవకాశం ఉంది. అల్లు అర్జున్‌తో ‘రేసుగుర్రం’లాంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన నల్లమలపు బుజ్జి నిర్మాతగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.