మసాలా దట్టించమంటున్న స్టైలిష్ స్టార్

0సక్సెస్ లో ఉండే సమయంలో ఎవరికైనా దూకుడు ఎక్కువే ఉంటుంది..  ఒక్క ఫెయిల్యూర్ ఎదిరైతే మాత్రం కాస్త ఆగి ఏం జరిగిందా.. ఎలా దీన్ని మళ్ళీ జరగకుండా చూసుకోవాలా అని ఆలోచిస్తారు.   స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పరిస్థితి ప్రస్తుతం అలానే ఉందట.  తన లాస్ట్ సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ బాక్స్ ఆఫీస్ వద్ద నిరుత్సాహ పరచడంతో తన తాజా చిత్రాన్ని ఎలా అయినా సక్సెస్ చేయాలని పట్టుదలతో ఉన్నాడట.

ఇప్పటికే విక్రమ్ కుమార్ రెండు స్టొరీ లైన్స్ చెప్పాడని మొదటి స్టొరీని డెవలప్ చేసి వినిపించినా సెకండ్ హాఫ్ నచ్చక పోవడంతో దాన్ని పక్కన బెట్టి సెకండ్ స్టొరీ లైన్ పై విక్రమ్ వర్క్ చేస్తున్నాడని సమాచారం. విక్రమ్ విషయంలో బన్నీ కి ఒకటే టెన్షన్ గా ఉందట. అదే ‘కమర్షియాలిటీ’.. విక్రమ్ ఎప్పుడూ ఫుల్ గా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే సినిమాలను డైరెక్ట్ చేసింది లేదు. ఏ సినిమా అయినా క్లాస్ టచ్ ఉంటుంది. దీనివల్ల బన్నీ రిస్క్ తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నాడట.

తాజా సమాచారం ప్రకారం విక్రమ్ తయారు చేసే స్క్రిప్టులకు కమర్షియల్ కోటింగ్ ఇవ్వమని కూడా కోరాడట. మరి ఈ ‘మనం’ డైరెక్టర్ కనుక స్తోరీకి గట్టిగా మాస్ మసాలా దట్టిస్తే అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్ అయినట్టే.