స్టైలిష్ స్టార్ వైఫ్ స్టైలిష్ గా..

0చాలామంది స్టార్ తెలుగు హీరోల వైఫ్స్ మాత్రం.. ఎక్కువగా ఇంటికే పరిమితం అయిపోతుంటారు. పెద్దగా పార్టీలకూ ఫంక్షన్లకూ విచ్చేయరు. కాని టాలీవుడ్ యంగ్ తరంగ్ మాత్రం ఆ ఆచారాన్ని చేంజ్ చేస్తోంది. ఈవెంట్లకు తమ వైఫ్ లతో వచ్చేసి హీరోయిన్ల సతీమణులు కూడా ఎట్రాక్ట్ చేస్తున్నారులే. అయితే హీరోలు ఛార్మింగ్ గా ఉన్నప్పుడు.. ఆ రియల్ లైఫ్ హీరోయిన్లు కూడా అలాగే ఉండాలిగా.

ఇప్పటికే నమ్రతా శిరోద్కర్.. ఉపాసన వంటి స్టార్ వైఫ్స్ తమ లుక్స్ తో అదరగొడుతున్న వేళ.. ఇప్పుడు అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి కూడా ఈ గ్యాంగ్ లో చేరిపోయింది. నిన్న హైదరాబాద్ లో H&M అనే ఫ్యాషన్ బ్రాండ్ తన షోరూం ఓపెన్ చేసిన సందర్బంగా.. ఆ బ్రాండ్ డ్రస్సు వేసుకుని మీర వెల్కమ్ చెప్పింది ఈ సుందరి. డ్రాప్ షోల్డర్ డ్రస్సులో.. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు అన్నట్లు ఫోజులిచ్చింది స్నేహ. మొత్తానికి గ్లామర్ లవర్స్ అందరూ ఖంగుతిన్నారంతే.

బాలీవుడ్ లో షాహిద్ కపూర్ ఢిల్లీ అమ్మాయి మీరా రాజ్పుత్ ను పెళ్ళి చేసుకున్న వెంటనే.. ఆమెను చూసిన ఔత్సాహికులు అందరూ హీరోయిన్ అవ్వమని తెగ వెంటపడుతున్నారు. కొంపతీసి మిస్సెస్ బన్నీ విషయంలో కూడా అలాంటి ఫీట్లు చేయరు కదా!!Allu-Arjun-Wife-Sneha-Reddy-Spotted-at-H-M-Brand-Showroom-Launch