షాపింగ్‌ మాల్‌ లో సూర్య హలచల్

0allu-arjunఅల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. శిరీషాశ్రీధర్‌ లగడపాటి, బన్నీవాస్‌ నిర్మాతలు. కె.నాగబాబు సమర్పిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. షాపింగ్‌ మాల్‌ నేపథ్యంలో వచ్చే కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్‌ ఈ చిత్రం కోసం కొత్త స్టైల్‌లోకి మారిపోయారు. సినిమా సినిమాకీ కొత్తగా కనిపించాలని తపించే ఆయన ఇందులో ఓ మిలటరీ అధికారి పాత్రలో కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఉంది బన్నీ హెయిర్‌స్టైల్‌. వక్కంతం వంశీకి దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. అయితే వంశీ రచించిన కథతో బన్నీ ఇదివరకు ‘రేసుగుర్రం’ చేశారు. ఏప్రిల్‌ 27న విడుదల చేయడమే లక్ష్యంగా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్‌ సంగీత ద్వయం విశాల్‌ – శేఖర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.