వెకేషన్ మూడ్ లో అల్లువారు

0

కొత్త సినిమా కమిట్ కాకపోవడంతో అల్లు అర్జున్ చాలా రోజుల నుండి హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఇక అయనతో పాటు ఫ్యామిలీ మొత్తం ఒక ట్రిప్ కు వెళ్లారట. ఆ సందర్భం గా ఒక ఫొటోకు కూల్ పోజిచ్చారు.

అల్లు అర్జున్ అమ్మా నాన్నతో పాటు గా అన్నదమ్ములు బాబీ – శిరీష్ లు.. వైఫ్ స్నేహ కూడా ఈ ఫోటోలో ఉండడం విశేషం. సాధారణంగా అల్లు అర్జున్ – స్నేహ ఉండే ఫోటోలు బయటకు వస్తాయి గానీ అరవింద్ గారు ఉండే ఫోటోలు చాలా అరుదు.. మరి డిన్నర్ టైం లో ముగ్గురు అబ్బాయిలతో ఏదైనా మంతనాలు సాగిస్తున్నారా లేదంటే… మంతనాలన్నీ పూర్తయిన తర్వాత చిల్ అవుట్ అవుతూ పోజిచ్చారా అనేది తెలియడం లేదు.. ఎందుకంటే బన్నీ- స్నేహ మాత్రం స్మైల్ తో ఉన్నారు.

ఈ ఫోటో సంగతి ఇలా ఉంటే అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో లాక్ అయిందట.. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమా అల్లు అర్జున్ కు బలం అయిన కామెడీ ఎంటర్టైనర్ జోనర్ లో సాగుతుందని సమాచారం. ఇక అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ మలయాళం సూపర్ హిట్ ‘ABCD’ రీమేక్ లో నటిస్తున్నాడు.
Please Read Disclaimer