అల్లువారి అబ్బాయి కోసం ఆయనొచ్చాడు

0

సినీ ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీ నుంచి హీరోగా అరంగేట్రం చేసినంత మాత్రాన కెరీర్కు ఢోకా లేదని అనుకోవడానికేమీ లేదు. ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా నిలదొక్కుకోలేక సతమతం అవుతున్న హీరోలు కూడా ఉన్నారిక్కడ. అందుకు ఒక ఉదాహరణ అల్లు శిరీష్. ఇప్పటిదాకా అతను ఐదు సినిమాల్లో నటించాడు. అందులో ‘శ్రీరస్తు శుభమస్తు’ మాత్రమే హిట్టయింది. ఆ సినిమాతో కొంచెం నిలదొక్కుకున్నట్లే కనిపించాడు కానీ.. తర్వాత వచ్చిన ‘ఒక్క క్షణం’ అతడిని పూర్వపు స్థితికి తీసుకెళ్లింది. ఇప్పుడు అల్లు వారి అబ్బాయి ఆశలన్నీ ‘ఏబీసీడీ’ మీదే ఉన్నాయి.

మలయాళంలో ఇదే పేరుతో హిట్టయిన సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న రీమేక్ చిత్రమిది. ఈ సినిమాను ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డితో పాటు ‘పెళ్లిచూపులు’ ఫేమ్ యాష్ రంగినేని కలిసి నిర్మిస్తున్నారు. వీళ్లిద్దరూ చాలదని ఇప్పుడు ఇంకో ప్రముఖ నిర్మాత వీరికి తోడయ్యాడు. ఆయనే.. దగ్గుబాటి సురేష్. కొన్నేళ్లుగా సినిమాల నిర్మాణం తగ్గించేసి.. మంచి కంటెంట్ ఉండి విడుదల విషయంలో ఇబ్బంది పడుతున్న చిన్న సినిమాల్ని టేకప్ చేసి.. మంచి ప్రమోషన్లతో తన బేనర్ మీద రిలీజ్ చేస్తున్నాడు సురేష్. ‘పెళ్లిచూపులు’.. ‘మెంటల్ మదిలో’.. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఆ కోవలోని సినిమాలే. ఐతే వాటిలాగా దీనికేమీ బ్యాకప్ అవసరం లేదు. అయినప్పటికీ సురేష్ రాక ఆశ్చర్యం కలిగించేదే. సినిమాకు హైప్ పెంచడానికే ఇలా చేశారేమో. సంజీవ్ రెడ్డి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రంలో రుక్సార్ థిల్లాన్ కథానాయికగా నటిస్తోంది. శుక్రవారమే ‘ఏబీసీడీ’ ఫస్ట్ లుక్ లాంచ్ అవుతోంది.
Please Read Disclaimer