శిరీష్ సినిమాకు రెండున్నర కోట్లా?

0

టాలీవుడ్లో పెద్దగా ఎదుగుదల లేకుండా ఉన్న హీరోల్లో అల్లు శిరీష్ ఒకడు. ‘శ్రీరస్తు శుభమస్తు’ మినహాయిస్తే అతడి కెరీర్లో హిట్ లేదు. దానికి ముందు వచ్చిన రెండు సినిమాలూ ఫ్లాపులే. ‘శ్రీరస్తు..’తో అయినా కెరీర్ గాడిన పడుతుందేమో అనుకుంటే.. ‘ఒక్కక్షణం’తో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇప్పుడతడి ఆశలన్నీ ‘ఏబీసీడీ’ మీదే ఉన్నాయి. మలయాళంలో ఇదే పేరుతో హిట్టయిన సినిమాను రీమేక్ చేస్తున్నారు. సంజీవ్ రెడ్డి అనే కొత్త దర్శకుడు దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికైతే పెద్దగా అంచనాలేమీ లేవు. ఇంకా ఇక్కడ ఈ చిత్రానికి బిజినెస్ కూడా మొదలైనట్లు లేదు.

కానీ ఇంతలోనే ‘ఏబీసీడీ’ హిందీ డబ్బింగ్- శాటిలైట్ రైట్స్ డీల్ పూర్తయినట్లు చిత్ర బృందం స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం. అది కూడా రూ.2.5 కోట్లకు హక్కులు అమ్ముడయ్యాయట. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. శిరీష్ అన్నయ్య అల్లు అర్జున్ సినిమా ‘సరైనోడు’ హిందీలో సెన్సేషన్ క్రియేట్ చేయడం గురించి పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చారు. ఈ క్రమంలోనే ‘ఏబీసీడీ’కి భారీ రేటు దక్కిందన్నారు. కానీ బన్నీ సినిమాతో శిరీష్ సినిమాకు పోలికేంటన్నదే అర్థం కావడం లేదు. హీరోగా బన్నీ రేంజేంటి? శిరీష్ స్థాయి ఏంటి? బన్నీ తమ్ముడు కదా అని అతడిని జనాలు చూసేస్తున్నారా అతడి సినిమాలు ఆడేస్తున్నాయా విడుదలకు రెండు నెలలుండగా శిరీష్ సినిమాకు ఇలా హిందీ డబ్బింగ్ శాటిలైట్ డీల్ పూర్తి కావడం అన్నది ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ డీల్ ఎంత వరకు నిజమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.
Please Read Disclaimer