ABCD శాటిలైట్ – డిజిటల్ జోరు

0

అన్నయ్య అల్లు అర్జున్ – డాడ్ అరవింద్ సూచనలతో అల్లు శిరీష్ హీరోగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు చాలానే ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన లుక్ మార్చాడు. జిమ్ముల్లో రెగ్యులర్ గా కసరత్తులు చేస్తూ లుక్ ని సమూలంగా మార్చేసేందుకు శిరీష్ ప్రయత్నిస్తున్నాడు. మారిన కొత్త రూపం 2.0లా ఉండాలన్నది అతడి ప్లాన్ అట. అతడు నటిస్తున్న తాజా చిత్రం ఎంతవరకూ వచ్చింది? అంటే.. త్వరలోనే రిలీజ్ కి వస్తోందట.

గౌరవం – కొత్తజంట – శ్రీరస్తు శుభమస్తు – 1971- బియాండ్ బార్డర్స్ – ఒక్క క్షణం వంటి చిత్రాల్లో నటించాడు శిరీష్. వీటిలో కొత్త జంట యావరేజ్. శ్రీరస్తు శుభమస్తు హిట్టు. ఒక్క క్షణం బావున్నా ఆడలేదు. మొత్తానికి శిరీష్ తనని తాను షైన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించుకోవాలన్న తపన అయితే కనబరిచాడు కానీ….!! జనాదరణ మాత్రం ఆశించినంత లేదు. అయితేనేం అతడి నాలెడ్జి – పట్టుదల – బ్యాకప్ ముందు అన్నీ తలవొంచాల్సిందేనన్నది ఫ్యాన్స్ మాట.

శిరీష్ ఇప్పుడు 2.0 రీలోడెడ్ అన్న తీరుగా బరిలో దిగుతున్నాడు. ఈసారి అతడు నటిస్తున్న ABCD ఒక డిఫరెంట్ ఫిలిం. “అమెరికన్ బోర్న్ కన్ ఫ్యూజ్డ్“ దేశీ అన్న ట్యాగ్ లైన్ కి తగ్గట్టే ఇందులో అమెరికా నుంచి ఇండియాకి వచ్చి ఆ లైఫ్ స్టైల్ ఇక్కడ దొరకబుచ్చుకోలేక – జేబులో పైసలు లేక.. చివరికి జీవితం అంటే ఏంటో తెలుసుకునే కుర్రాడిగా కనిపిస్తాడట. ఈ సినిమా తనకి పెద్ద హిట్టిస్తుందని హోప్ తో ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా హిందీ శాటిలైట్ & డిజిటల్ రైట్స్ – డబ్బింగ్ రైట్స్ కి భారీగానే డిమాండ్ పలికింది. మనీష్ జీకి చెందిన ప్రఖ్యాత గోల్డ్ మైన్ టెలీఫిలింస్ కంపెనీ ఈ హక్కుల్ని 2.5 కోట్లు చెల్లించి చేజిక్కించుకుంది. సంజీవ్ దర్శకత్వంలో బిగ్బెన్ ఫిలింస్ అధినేత యశ్ తో కలిసి మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది మలయాళ ఏబీసీడీకి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. రుద్రాక్ష్ దిల్లాన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.




Please Read Disclaimer