అంతా ఒక్క క్షణం వల్లే!!

0ఎంత సినీ నిర్మాత కొడుకైన సరే ఎంతో కొంత ఒక హిట్ అందితేనే బయట నుంచి ఆఫర్లు వస్తుంటాయి. కొంచెం టాలెంట్ ఉన్నా కూడా హోమ్ బ్యానర్ ను ప్రతి సారి వాడాల్సిన పని లేదు. గత కొంత కాలంగా సొంతంగా డెవలప్ అవ్వాలని చూస్తున్న హీరోల్లో అల్లు శిరిష్ ఉన్నాడు. 100 కోట్లు పెట్టి సినిమా నిర్మించే గీత ఆర్ట్స్ వారసుల్లో ఒకడైన శిరీష్ చాలా వరకు సొంతంగా ఎదగాలనే చూస్తున్నాడు.

చివరగా చేసిన ఒక్క క్షణం సినిమా అయితే శిరీష్ కు మరచిపోలేని డిజాస్టర్ ను ఇచ్చింది. అయితే ఆ సినిమా ఏ విధంగా ఉపయోగ పడలేదు అందుకుంటున్న సమయంలో శిరీష్ కు అదే సినిమా వల్ల మంచి అఫర్ వచ్చింది. ఇటీవల సూర్యా సినిమాలో శిరీష్ కు అవకాశం వచ్చింది అనే న్యూస్ వచ్చింది కదా.. అది ఒక్క క్షణం చేసిన మేలేనట. ఆ విషయాన్ని డైరెక్ట్ గా శిరీష్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

దర్శకుడు కెవి ఆనంద్ 24 ఏళ్ల కుర్రాడి పాత్ర కోసం వెతుకుతున్నట్లు ఎవరో చెప్పగా.. నా గురించి నా స్నేహితురాలు ఒకరు చెప్పారట. అయితే అతని సినిమాలు నేను ఒక్కటి కూడా చూడలేదని చెప్పడంతో వెంటనే కెవి ఆనంద్ కు ఒక్క క్షణం డివిడి పంపారట. అది చుసిన దర్శకుడు వెంటనే ఒకే చేసినట్లు శిరీష్ తెలిపాడు. ఇక ఆ ప్రాజెక్టలో మోహన్ లాల్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.