అల్లు శిరీష్ తో నాని బ్యూటి

0అల్లు అర్జున్ తరువాత ఆ స్థాయిలో కాకపోయినా తనకంటూ కొంత గుర్తింపు తెచ్చుకోవాలని బ్రదర్ అల్లు శిరీష్ చాలానే కష్టపడుతున్నాడు. ఎలాగైనా మొదటి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు. అత్తను చేసిన చివరి సినిమా ఒక్క క్షణం అంతగా ఆడకపోవడంతో సక్సెస్ కథలను ఎంచుకోవడానికి శిరీష్ మొగ్గు చూపుతున్నాడు. ఆ విధంగా ఆలోచించే ఈ మధ్య ఒక మలయాళం కథను తెలుగులో రీమేక్ చేయడానికి ఒప్పుకున్నాడు.

మళయాలంలో దుల్కర్ సల్మాన్ నటించిన ఎబిసిడి సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి మధుర శ్రీధర్ ముందే రైట్స్ తీసుకున్నారట. ఇక ఆ కథకు శిరీష్ సెట్ అవుతాడని డేట్స్ ఫిక్స్ చేసుకొని ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తున్నారు. ఇక రీసెంట్ గా కథానాయికగా ఋక్షర్ దిల్లోన్ ని ఒకే చేశారు. ఆమె ఆల్ రెడీ నానితో కృష్ణార్జున యుద్ధంలో నటించింది. ఆ సినిమా అనుకున్నంతగా హిట్ కాకపోవడంతో అవకాశాలు రావేమో అని అనుకుంటుండగా బేబీకి సడన్ అఫర్ అందింది.

కొత్త దర్శకుడు సంజీవి రెడ్డి తెరకెక్కించే ఈ సినిమాకు జూడా సాంది మ్యూజిక్ అందించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతం అవుతున్నాయి. ఇక అల్లు శిరీష్ ఈ ప్రాజెక్టుతో పాటు కోలీవుడ్ లో సూర్య సినిమాలో కూడా నటించనున్న సంగతి తెలిసిందే. కెవి.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో మోహన్ లాల్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.