అఖిల్ మాజీ గర్ల్ ఫ్రెండ్ తో అల్లు శిరీష్

0మెగా ఫ్యామిలీ మెంబర్స్ ను తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. అల్లు అర్జున్ తో పోలిస్తే.. అల్లు శిరీశ్కు క్రేజ్ తక్కువైనప్పటికీ.. సినీ సర్కిల్స్ లోనూ.. బిజినెస్ సర్కిల్స్ లోనూ అతగాడికున్న పేరు ప్రఖ్యాతులు ఎక్కువే. స్టైలీష్ స్టార్ గా అల్లు అర్జున్ కు క్రేజ్ ఉన్నప్పటికీ.. అతగాడి బ్రదర్ అల్లు శిరీశ్ సినిమాల్లో కంటే.. సినిమా బిజినెస్ లో ఇంటలిజెంట్ కుర్రాడిగా పేరుంది.

ఇంకా పెళ్లి కాని ఈ కుర్రాడి సరదా ముచ్చట్ల గురించి ఇండస్ట్రీలో అప్పుడప్పుడు చెప్పుకున్నా.. అవన్నీ ప్రైవేట్ మాటలగానే కనిపిస్తుంటాయి. అయితే.. అల్లు శిరీశ్కు సంబంధించిన బయటకు వచ్చిన రెండు ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. సోషల్ మీడియాను ఒక రేంజ్లో కుదిపేస్తున్నాయి.

అల్లు శిరీశ్ పార్టీ టైం ఎంత జోష్ గా ఉంటుందన్న విషయాన్ని తాజా పిక్స్ చెబుతున్నాయని చెబుతున్నారు. మాంచి ఉత్సాహంతో ఉన్న అల్లు శిరీశ్ తో క్లోజ్ గా మూవ్ అవుతున్న భామ మీద అందరి చూపులు ఫోకస్ కావటం.. ఆశ్చర్యంతో అవాక్కు కావటం ఇప్పుడు మామూలైంది. ఇంతకీ.. శిరీశ్తో క్లోజ్ గా ఉన్నదెవరన్నది చూస్తే.. ఇట్టే అర్థమైపోతుంది. ఫోటో కాస్తంత డిమ్ గా ఉందంటారా? ఓకే.. అమ్మాయి పేరు చెప్పేస్తాం.. తర్వాతి వివరాలన్నీ మీకు ఇట్టే అర్థమైపోతాయి. ఇంతకీ.. ఆమె పేరు ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం. ఆమె పేరు.. శ్రియా భూపాల్. జీవీకే వారింట అమ్మాయి. ఇప్పుడు అర్థమైందా?Photos-of-Shriya-Bhupal-with-Shrish-rock-the-internet