అల్లు శిరీష్ ఈసారైనా వస్తాడా?

0టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ గత కొంత కాలంగా హిట్టు కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలుగులో చేసిన సినిమాల వల్ల అతనికి పెద్దగా గుర్తింపు అందడం లేదు. కానీ మెగా ఫ్యామిలిలో ఎవరు చేయని విధంగా ఇతర భాషల్లో ట్రై చేస్తున్నాడు. ఆ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ అల్లు శిరీష్ కి క్రేజ్ మాత్రం బాగానే వస్తోంది. ఇక మొదటి సారి అల్లు శిరీష్ మలయాళంలో చేసిన ఒక సినిమా తెలుగులో విడుదల కానుంది.

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 1971: బియాండ్ బార్డర్స్ సినిమా యుద్ధ భూమిగా తెలుగులో విడుదల కానుంది. మేజర్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండో పాక్ వార్ నేపథ్యంలో సాగుతుంది. అయితే ఆ సినిమా విడుదల తేదీపై కన్ఫ్యూజన్ ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా డబ్బింగ్ పనులు పూర్తయ్యి చాలా కాలమవుతోంది. గతంలోనే సినిమాను విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ డబ్బింగ్ పనులు ఆలస్యం అయినట్లు చెప్పారు.

జూన్ 22న వస్తున్నట్లు చెప్పినప్పటికీ మళ్లీ కొని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇక ఇప్పుడు ఫైనల్ గా విడుదల చేయనున్న ఏ.ఎన్ బాలాజీ ఒక తేదీని ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 29న భారీగా విడుదల చేయడానికి ప్లాన్ వేసుకున్నారు. పెద్ద చిత్రాలు కూడా పోటీగా లేకపోవడం సినిమాకు కలిసొచ్చే అంశం. అయితే మలయాళం లో మాత్రం ఈ సినిమా అంతగా ఆడలేదు. మరి తెలుగులో ఎంతవరకు హిట్ అవుతుందో చూడాలి.