తొలిప్రేమను కలుసుకున్న అమల

0ఇప్పుడు ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నా.. లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నా.. తారలకు కూడా తొలిప్రేమలు ఉంటాయి. వారు కూడా సినిమాలు చూసి పెరిగిన వారే కావడంతో.. అప్పటి స్టార్లను ఆరాధించడం సహజం. కానీ కాలక్రమేపీ వారిని కలిసే అవకాశం రావచ్చు.

ఇప్పుడు అమలాపాల్ కు అలాంటి పరిస్థితే ఎదురైంది. ఈ భామ ఇప్పుడు క్రేజీ హీరోయిన్ అయిపోయింది కానీ.. చిన్నపుడు మాధవన్ ను విపరీతంగా అభిమానించేదట. సఖి సినిమాతో ఇండియా మొత్తానికి లవర్ బోయ్ ఇమేజ్ ను మాధవన్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ విషయాలన్నటినీ స్వయంగా చెప్పుకొచ్చింది అమలాపాల్. తాజాగా ఈ సుందరాంగి ఫిలిం ఫేర్ అవార్డ్ ఈవెంట్ లో పాల్గొంది. ఈమెకు అవార్డు ఏమీ రాలేదు కానీ.. తన అందాలతో భలేగా మురిపించింది. ఈ సమయంలో సీనియర్ హీరో మాధవన్ ను కలుసుకునే అవకాశం అమలపాల్ కు దక్కింది.

తన ఫస్ట్ క్రష్ మాధవన్ అంటూ అమల చెప్పిన సంగతులు అందరినీ తెగ మురిపించాయి. విక్రమ్ వేద చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్-క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకున్నాడు మాధవన్. ఈ అవార్డును ప్రకటించిన అమలాపాల్.. ‘ఈ అవార్డ్ ఎవరికి దక్కిందంటే.. నా చైల్డ్ హుడ్ క్రష్ మాధవన్’ అంటూ చెప్పడం అందరిలోనూ నవ్వులు పూయించింది.