అమలా పాల్ జాక్ పాట్ కొట్టింది

0

సౌత్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం నవాబ్ చిత్రంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఈయన చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం పొన్నియన్ సెల్వన్ ను పట్టాలెక్కించేందుకు సిద్దం అయ్యాడు. గత ఆరు నెలలుగా ఈ విషయమై తమిళ సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మొదట ఈ చిత్రంను భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించేందుకు ముందుకు వచ్చారు. అయితే 2.ఓ ఫలితమో లేక మరేంటో కాని వారు ఈ ప్రాజెక్ట్ ను వదిలేశారు. దాంతో మణిరత్నం ఈ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను రిలయన్స్ వారికి అప్పగించినట్లుగా తెలుస్తోంది. మణిరత్నం కథ నచ్చడంతో రిలయన్స్ వారు ఈ ప్రాజెక్ట్ ను టేకోవర్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు గాను ఐశ్వర్య రాయ్ నయనతార అనుష్క త్రిషలతో పాటు ఇంకా పలువురు స్టార్ హీరోయిన్స్ పేర్లు పరిశీలనకు వచ్చాయి. ఆమద్య ఐశ్వర్య పేరు బలంగానే వినిపించింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ గా అమలా పాల్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. కెరీర్ లో ఇప్పటి వరకు బిగ్గెస్ట్ సక్సెస్ లు అందుకోక పోవడంతో పాటు ఈ మద్య కాలంలో ఈమెకు పెద్దగా అవకాశాలే రావడం లేదు. అలాంటి సమయంలో అమలాపాల్ కు ఈ చిత్రం జాక్ పాట్ తో సమానం.

సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు మణిరత్నం ఈ చిత్రంను బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకు వెళ్లనున్నాడు. పౌరాణిక నేపథ్యంలోని కథతో ఈ చిత్రం రూపొందబోతుంది. ఇలాంటి పౌరాణిక పాత్రకు అమలా పాల్ అయితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో మణిరత్నం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇప్పటి వరకు వచ్చిన వార్తలు అన్ని కూడా ఆనోట ఈనోట బయటకు వచ్చినవే. త్వరలోనే పొన్నియన్ సెల్వన్ గురించిన పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.
Please Read Disclaimer