హాట్‌టాపిక్‌గా మారిన అమలపాల్ హాట్‌పోస్టర్!

0దాదాపు పదకొండేళ్ల కిందట తమిళంలో వచ్చిన ‘తిరుట్టుపయలే’ సినిమాకు ఇప్పుడొక సీక్వెల్ వస్తోంది. తొలి వెర్షన్ లో జీవన్, మనోజ్ కే జయన్, అబ్బాస్, మాళవిక, సోనియా అగర్వాల్ లు ముఖ్య పాత్రల్లో నటించారు. తమిళంలో హిట్టైన ఆ సినిమా తెలుగు, కన్నడలో కూడా రీమేక్ అయ్యింది. అయితే ఈ భాషల్లో ఆ సబ్జెక్ట్ ఆకట్టుకోలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు తమిళంలో ‘తిరుట్టుపయలే-2’ వస్తోంది. బాబీ సింహా, అమలపాల్, ప్రసన్నలు ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు.

తాజాగా విడుదల అయిన ఈ సినిమా పోస్టర్ ఒకటి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అందులో బాబీ సింహా, అమల పాల్ రొమాంటిక్ పోజులో దర్శనమివ్వడమే ఈ చర్చకు కారణం. వర్షం బ్యాక్‌గ్రౌండ్లో అమల, బాబీలు రొమాంటిక్ మూడ్‌లో ఉంటారు. ఇక అమల చీరకట్టు కూడా హాట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో తిరుట్టు పయలే-2 పోస్టర్ చర్చనీయాంశంగా మారింది.

అలాగే అమలపాల్ తరచూ సోషల్ మీడియాకు టార్గెట్‌గా అవుతూ ఉంటుంది కదా, ఇప్పుడు కూడా అది తప్పడం లేదు. ఈమె హాట్‌గా కనిపించడంపై కొంతమంది విమర్శలు మొదలుపెట్టారు. భర్త ఏఎల్ విజయ్ తో విడాకుల అనంతరం అమల సినిమాలతో బిజీగా ఉంది. గ్లామరస్‌గా కనిపించడానికి ఆమె వెనుకాడటం లేదు. ఈ క్రమంలో వివిధ అంశాల్లో కొంతమంది అమలను తప్పు పడుతూ వస్తున్నారు. వాళ్లు ఇప్పుడు కూడా అమల విషయంలో అనుచితమైన కామెంట్లను చేస్తున్నారు.

Stunning-Naval-Show