అమల అందం చూడరయా!

0గ్లామర్ విషయంలో మలయాళ భామ అమలాపాల్ ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. కథ.. పాత్రలు ఎంత బోల్డ్ గా ఉన్నా ఫర్వాలేదని తొలి సినిమా `సింధు సామవేళి`తోనే చాటి చెప్పింది. ఆ చిత్రం నేటి చరిత్రగా తెలుగులో కూడా అనువాదమైంది. మామ – కోడలు మధ్య బంధం నేపథ్యంలో సాగే ఆ చిత్రం అప్పట్లో సంచలన విజయం సొంతం చేసుకొంది. అమలాపాల్ అందులోని సుందరి పాత్రని చేయడంపై పెద్ద చర్చే నడిచింది. అలాంటి అమలాపాల్ ని ఆ తర్వాత అభినయ ప్రాధాన్యమున్న పాత్రలే వరించాయి. కమర్షియల్ కోణంలో గ్లామర్ ని చూపించే అవకాశం ఏ సినిమా ఆమెకి పరిపూర్ణంగా ఇవ్వలేదు. కొద్దిలో కొద్దిగా అంటే తెలుగులోనే `బెజవాడ` – `నాయక్` చిత్రాలు ఆ అవకాశం ఇచ్చాయి. తమిళంలో ఆమె పద్ధతైన సినిమాలే చేసింది.

అంతలోనే దర్శకుడు విజయ్ తో పెళ్లి కావడంతో ఆమెని గ్లామర్తో కూడిన పాత్రలతో సంప్రదించే సాహసం ఎవ్వరూ చేయలేదు. అయితే పెళ్లి బంధం నుంచి బయటికొచ్చాక తనలో గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని చాటుతూ మునుపటిలాగా సినిమాల్ని ఎంపిక చేసుకోవడంపై దృష్టిపెట్టింది. కానీ పెద్దగా అవకాశాలు రాలేదు. ఇప్పుడు ఆమె మరో అడుగు ముందుకేసి తనలోని గ్లామర్ యాంగిల్ ని చూపిస్తూ ఫొటోషూట్ లు చేయించుకొంటోంది. వాటిని ఆన్ లైన్లో పెడుతూ నా టాలెంట్ చూడండని చెప్పకనే చెబుతోంది. ఈ రేంజ్ అందాలతో అమలాపాల్ తెరపై కనిపిస్తే మాత్రం ప్రేక్షకులకు పండగే అని ప్రత్యేకంగా చెప్పాలా?