ఆమెను పైకిలేపి అమలను తొక్కేశారా?

0


amala-paul-hot-picమొన్నటివరకు ఒకటే రూమర్స్.. అసలు విఐపి 2 సినిమా నుండి డస్కీ బ్యూటి అమలా పాల్ ను తీసేశారని. అసలు అమల అండ్ ఎ.ఎల్.విజయ్ మధ్యలో ధనుష్ కారణంగా విభేదాలు వచ్చాయనేది ఒక రూమర్ అయితే.. తరువాత సుచీలీక్స్ పేరుతో ఈ రిలేషన్ గురించి చాలా ఆసభ్యకరంగా టాక్ వచ్చింది. ఇదంతా చూసి అమలను విఐపి సినిమా సీక్వెల్ నుండి తప్పించారని అన్నారు. కాని కట్ చేస్తే.. అలాంటిదేం లేదు.

అసలు రూమర్లను పెద్దగా పట్టించుకోని ధనుష్.. అమలా పాల్ ను తన భార్య క్రింద ఈ సినిమాలో చూపించేశాడు. పైగా వీరి రొమాన్స్ కూడా అదిరిపోయింది. కాకపోతే ఇప్పుడు చెప్పొచ్చేదేంటంటే.. ఈ రెండో భాగం తాలూకు ఆడియో లాంచ్ ను ముంబయ్ లో జరిపారు. కేవలం కాజోల్ కు ముంబయ్ నుండి రావడం కుదరకపోవడంతో.. ఎంటైర్ యునిట్ అంతా చెన్నయ్ నుండి ముంబయ్ వెళ్ళి అక్కడ ట్రైలర్ మరియు ఆడియో లాంచ్ చేశారని టాక్. అదంతా సర్లే కాని.. ఆ లాంచ్ లో విలన్ గా చేసిన కాజోల్ కు బీభత్సమైన ప్రయారిటీ ఇచ్చారు కాని.. అమలను మాత్రం పెద్దగా పట్టించుకోలేదని ఈవెంట్ ను వీక్షించిన ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.

ఒక ప్రక్కన కోట్లిచ్చి తెచ్చిన కాజోల్ ఉండగా.. మరి అమలను ఎలా ప్రమోట్ చేస్తారు? ఇప్పుడు తెలుగు సినిమాకు పట్టుకున్న జబ్బే.. తమిళ సినిమాకు పట్టేసుకున్నట్లుంది. ఇక్కడున్న టాలెంటడ్ పీపుల్ ను కాదని.. పక్క రాష్ట్రాలనుండి కొందరిని తెస్తాం.. వారికే ప్రయారిటీ ఇస్తాం. ముందు నుండి సీన్లో ఉన్నవారిని కాస్త తక్కువ చేస్తాం. ఆలోచించండి.. చాలా ఎగ్జాంపుల్స్ ఇట్టే తట్టేస్తాయ్!!