అమలకి బాలీవుడ్ లో ఛాన్స్!

0చాలా రోజులుగా బాలీవుడ్ ప్రయత్నాలు చేస్తోంది అమలాపాల్. దక్షిణాదిన పద్ధతైన పాత్రల్లోనే కనిపించిన ఈ ముద్దుగుమ్మ కొంతకాలంగా హాట్ హాట్ ఫొటోషూట్ లతో అదరగొడుతోంది. అదంతా కూడా బాలీవుడ్ ని ఆకర్షించడానికే. ఎట్టకేలకి ఆమె ప్రయత్నాలు ఫలితాన్నిచ్చాయి. అర్జున్ రామ్ పాల్ సరసన ఓ థ్రిల్లర్ చిత్రంలో నటించే అవకాశం అమలని వరించింది. త్వరలోనే ఆ సినిమా షూట్ కోసం హిమాలయాలకి వెళ్లబోతోందట అమలాపాల్. అమల అందం చూశాక బాలీవుడ్ నుంచి పలువురు దర్శకులు ఆమెని సంప్రదించారట. కానీ సరైన ప్రాజెక్టులు కాదనిపించడంతో ఆమె నో చెప్పిందట.

అయితే తాజాగా వచ్చిన ఆఫర్ కి మాత్రం ఆమె ఓకే చెప్పేసిందని సమాచారం. అమలాపాల్ పెళ్లి బంధం నుంచి బయటికొచ్చాక సినిమా కెరీర్పై సీరియస్ గా దృష్టిపెట్టింది. అందుకోసం దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ ప్రయత్నాలు చేసింది. కానీ సరైన అవకాశాలు మాత్రం రాలేదు. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలనుకుందో ఏమో ఏకంగా బాలీవుడ్ పై దృష్టి పెట్టేసింది. పెళ్లయినా తన గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ ఆమె పలు హాట్ ఫొటోషూట్లు చేసింది. అవి కుర్రకారునే కాదు – బాలీవుడ్ ని కూడా బాగా ఆకర్షించాయి. ఆ ఫలితమే బాలీవుడ్ చిత్రం. అన్నట్టు ఈ చిత్రంలో ఆమె బికినీలో కనిపించడానికి కూడా ఓకే చెప్పిందని సమాచారం. మరి అమలాపాల్ కి బాలీవుడ్ ఏ రేంజ్ లో కలిసొస్తుందో చూడాలి.