బూతు వీడియో కోసం అమల వెయిటింగ్

0Amala-Paul-with-cameraతమిళ సినిమా ఇండస్ట్రిలో అతిపెద్ద వివాదాస్పద సూచి లీక్స్ గురించి తెలియనివారు ఉండరు. పాపులర్ సింగర్ సుచిత్ర కార్తీక్ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా జరిగిన రచ్చకే సుచి లీక్స్ అని పేరు. నా దగ్గర కొన్ని తమిళ సినిమా సెలబ్రిటీలు వీడియో లు ఉన్నాయి అని వాళ్ళ అసలు భాగోతాలు బయట పెడతానంటూ హెచ్చరించి మీడియాలో ఒక నేషనల్ న్యూస్ మించి ఆ ఎకౌంట్ పాపులర్ అయ్యింది. దానికి ప్రతిఫలంగా సుచిత్రపై దాడి కూడా జరిగింది అని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సుచిత్ర కనిపించకుండా పోయింది. ఆమె ట్విటర్ అక్కౌంట్ కూడా డిఆక్టివ్ చేయబడింది. వాళ్ళ ఆయన కార్తీక్ మీడియా ముందుకు వచ్చి మా ఆవిడకు మతిస్థిమితం లేదని అమెరికా లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అని చెప్పాడు. తరువాత హ్యాకింగ్ అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు.

ఈ వివాదంలో ముఖ్యంగా తమిళ్ హీరో ధనుష్ అమలా పాల్ గురించి ప్రస్తావిస్తూ వాళ్ళ రాసలీలలు వీడియోలు నా దగ్గర ఉన్నాయని.. అవి ఒక ఆదివారంనాడు విడుదల చేస్తాను సదరు ఎకౌంట్స్ నుండి ట్వీట్స్ వచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ – సింగర్ ఆండ్రియా – త్రిష-ధనుష్ ఫోటోలు కూడా అప్పటికే లీక్ చేసి పెద్ద రచ్చే చేసింది సుచీలీక్స్. ఈ మధ్య ‘విఐపి2’ ప్రమోషన్లో అమలా పాల్ మీడియాకు చిక్కినప్పుడు సూచి లీక్స్ గురించి అడిగిన ప్రశ్న కు ఆమె చాలా వెటకారంగా “నేను చాలా ఆదివారాలు ఎదురుచూశాను నా వీడియోల కోసం. కానీ ప్రతి ఆదివారం నన్ను నిరాశ పరిచాయి. ఎప్పుడు వస్తాయో కాస్త మీరే చెప్పండి” అంటూ లీక్ చేస్తానన్న సదరు బూతు వీడియోలపై ఘాటుగా సెటైర్ వేసింది అమలా పాల్.

ఇకపోతే.. సుచీలీక్స్ విషయంలో చాలమంది పెద్ద మనుషులు ఉండటం చేత.. ఆమే చేత ఎకౌంట్ డిలీట్ చేయించి వేరే దేశం పంపించారు అని ఒక రూమర్ ఉంది. అసలు ఈ మొత్తం యవ్వారంలో నిజానిజాలు ఏంటనేది ఇంతవరకు పోలీసులు కూడా కనిపెట్టకపోవడం మాత్రం కాస్త తేడాగానే అనిపిస్తోంది కదూ.