సెక్సీ యోగా బ్యూటి

0సౌత్ లో హాట్ బ్యూటీగా గుర్తింపు పొందాలంటే చాలా కష్టపడాలి. మన హీరోలు ఫిట్ నెస్ కోసం వర్కౌట్స్ ఏ రేంజ్ లో చేస్తారో గాని హీరోయిన్స్ మాత్రం వారికంటే ఎక్కువగా కష్టపడతారని చెప్పాలి. ఓ వైపు అందాన్ని మెయింటైన్ చేస్తూ.. అందాల కొలతలు మారకుండా చూసుకోవాలి. ఏ మాత్రం తేడా వచ్చినా సినిమా అవకాశాలు తగ్గిపోతాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ మధ్య తారలు యోగా కూడా మొదలు పెట్టారు.

హీరోయిన్స్ అయితే ఆ డోస్ ఎక్కువగానే పెంచారు. యోగా లేనిదే రోజుని మొదలు పెట్టడం లేదు. ఆ తరహాలో రోజు యోగా చేస్తూ హాట్ బ్యూటీ అమలాపాల్ అందాన్ని కాపాడుకుంటోంది. అప్పుడప్పుడు ఆమె కష్టాన్ని నెటీజన్స్ తో పంచుకుంటుంది. దిశా పాటాని – పూజా హెగ్దే – మాళవిక అరోరా లాంటి ముద్దు గుమ్మలు ఈ తరహాలో ఫిట్ నెస్ చేస్తూ కుర్రకారుని ఎక్కువగా ఆకర్షిస్తుంటారు. రీసెంట్ గా అమలా పాల్ పోస్ట్ చేసిన ఒక ఫొటో చాలా డిఫరెంట్ గా ఉంది.

తలక్రిందులుగా వేసిన ఒక ఆసనంలో సోయగాలను స్పెషల్ గా ప్రజెంట్ చేసింది. షార్ట్ స్పోర్ట్స్ టాప్ – హాట్ ప్యాంట్ అలాగే ఒక స్టైలిష్ టాటూ తో సెక్సీగా కనిపించింది. చూస్తుంటే మరో ఐదేళ్లు అమ్మడు స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సినిమాల విషయానికి వస్తే. ఈ మల్లు బ్యూటీ కోలీవుడ్ సినిమాల్లో బాగానే అవకాశాలను అందుకుంటోంది. తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు రావడం లేదు. గతంలో నాగార్జున – నాని మల్టీస్టారర్ లో నటించే అవకాశం వచ్చింది అనుకున్నప్పటికి ఆమె స్థానంలో మళ్లీ రావా ఫెమ్ ఆకాంక్ష సింగ్ ను ఎంచుకున్నారు.