`ఎన్టీఆర్`లో లక్ష్మీపార్వతిగా ఆ నటి?

0టాలీవుడ్ లో ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ అత్యంత చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్` బయోపిక్ నుంచి వర్మను తప్పించడం….ఆ తర్వాత తేజ తెరకైకి రావడం….చివరకు క్రిష్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ కావడం వంటి విషయాలు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర దర్శకుడి విషయంలో ఎంత చర్చ జరిగిందో…..ఎన్టీఆర్ జీవితంలో అత్యంత కీలకమైన లక్ష్మీ పార్వతి పాత్ర…ఆ బయోపిక్ లో ఉంటుందా లేదా అన్న విషయంపై కూడా అంతే చర్చ జరిగింది. తాజాగా `ఎన్టీఆర్`లోని కీలకమైన పాత్రల్లో నటించబోతోన్న నటీనటుల పేర్లు అఫీషియల్ గా రివీల్ అవుతున్న నేపథ్యంలో లక్ష్మీ పార్వతి పాత్ర పై కూడా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్ర ఉంటుందని…ఆ పాత్రలో సీనియర్ నటి ఆమని నటించబోతోందని…. ఓ అనధికారిక వార్త టాలీవుడ్ లో షికారు చేస్తోంది.

అయితే చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించే వరకు ఇందులో లక్ష్మీపార్వతి పాత్ర ఉంటుందా….ఉండదా అన్న విషయంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. ఒక వేళ ఉన్నా….ఆమె పాత్రను ఎలా చూపించబోతున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. బాలకృష్ణ ఆధ్వర్యంలో తెరకెక్కుతోన్న ఈ బయోపిక్ లో లక్ష్మీపార్వతి పాత్ర పాజిటివ్ గా ఉంటుందా నెగెటివ్ గా ఉంటుందా అన్నది మరో భేతాళ ప్రశ్న. అసలు ఈ సినిమాలో తన పాత్రను పెట్టేందుకు లక్ష్మీ పార్వతి అంగీకరిస్తుందా…అన్నది మరో ప్రశ్న. ఒక వేళ అంగీకరించినా…పాజిటివ్ గా ఉంటేనే అంగీకరిస్తుంది. కానీ అలా చూపించేందుకు చిత్ర యూనిట్….సుముఖంగా ఉంటుందా లేదా అన్నది మరో ప్రశ్న. ఒకవేళ కర్ర విరగ కుండా…పాము చావకుండా….ఆమె పాత్రను పరిమితం చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశం..పెళ్లికి దారితీసిన పరిణామాలు….ఇంతవరకు మాత్రమే `ఎన్టీఆర్ `లో చూపిస్తే …ఉభయులకు శ్రేయస్కరం. లక్ష్మీపార్వతి ఎపిసోడ్ తో పాటు పలు కీలకమైన ఘట్టాలు ఈ సినిమాలో ఉంటాయని – అవసరమైన వరకే వాటిని చూపిస్తారని టాక్. అయితే ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే అంశాలను …స్కిప్ చేసి చూపిస్తారన్నది ఓపెన్ సీక్రెట్.