అమర్ అక్బర్ అంటోనీ ఫస్ట్ డే కలెక్షన్స్

0

మాస్ మహారాజా రవితేజ – శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘అమర్ అక్బర్ అంటోనీ’ నిన్నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ కూడా బయటకు వచ్చాయి. రివ్యూస్.. మౌత్ టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేసింది.

మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు గానూ రూ.. 3.42 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. రవితేజ గత చిత్రం ‘నేల టికెట్’ మొదటి రోజు కలెక్షన్స్ రూ.3.47 కోట్లు. ఈలెక్కన మాస్ రాజా క్రేజ్ అలానే ఉన్నట్టు మనం అనుకోవాలి. సినిమాకు మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ నిలకడగా ఉండడం విశేషం. మొదటి వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించే సత్తాను బట్టి ఈ సినిమా విజయం వైపు పయనిస్తుందా లేదా అనే విషయం చెప్పగలం.

రెండు తెలుగు రాష్ట్రాలకుగానూ మొదటి రోజు ‘అమర్ అక్బర్ అంటోనీ’ తీసుకొచ్చిన ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇవే.

నైజాం – 1.26 cr

సీడెడ్ – 0.47 cr

ఉత్తరాంధ్ర – 0.45 cr

ఈస్ట్ – 0.29 cr

వెస్ట్ – 0.21 cr

కృష్ణ – 0.20 cr

గుంటూరు – 0.41 cr

నెల్లూరు – 0.13 cr

టోటల్ – Rs.3.42 cr (ఏపీ + తెలంగాణా రోజుల షేర్)
Please Read Disclaimer