వీడియో వైరల్: ఏనుగు బొమ్మేసిన ఏనుగు!

0చిత్రలేఖనం, రంగులు వేయ‌డం అనేది ఒక ఆర్ట్. అంత ఈజీగా ఎవ్వ‌రూ వేయ‌లేరు. ఆ క‌ళ పుట్టుక‌తో వ‌చ్చేది. కొంత‌మంది క‌ష్ట‌ప‌డి నేర్చుకున్నా స‌రిగా వేయ‌లేరు. దానికి క‌ఠోర శ్ర‌మ అవ‌సరం. మ‌రి.. మాన‌వ మాత్రుల‌కు పెయింటింగ్ వేయాలంటే ఇంత క‌ష్ట‌ప‌డాల్సొస్తే జంతువులు ఇంకెంత క‌ష్ట‌ప‌డాలి. అస‌లు.. జంతువులు పెయింటింగ్ వేస్తాయా? వాటికి బ్ర‌ష్ ప‌ట్టుకోవ‌డం వ‌చ్చా? అనే పిచ్చి ప్ర‌శ్న‌లు వేస్తాం మ‌నం. కాని.. ఓ ఏనుగు మాత్రం ఎంతో అందంగా ఓ చిత్రాన్ని గీసింది. పెయింటింగ్ అంటే పికాసో దే అని ఎలా అంటామో.. ఈ ఏనుగు గీసిన బొమ్మ చూస్తే పెయింటింగ్ అంటే ఈ ఏనుగుదే అనే రేంజ్ లో ఉంటుంది ఈ చిత్ర‌లేఖ‌నం. ఫేస్ బుక్ లో షేర్ అయిన ఈ ఏనుగు చిత్ర‌లేఖ‌నం వీడియో చూస్తే మీరే నోరెళ్ల‌బెట్ట‌డం ఖాయం.