మరో వారసుడు వస్తున్నాడు

0



పాలిటిక్స్ లోను.. సినిమా ఇండస్ట్రీలోను వారసత్వం విపరీతంగా వర్కవుట్ అవుతుంది. అఫ్ కోర్స్.. ఇది లాంఛింగ్ కు మాత్రమే యూజ్ అవుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. ట్యాలెంట్ లేకుండా జనాలు ఏ మాత్రం పట్టించుకునే ఛాన్స్ ఉండదు. తెలుగునాట మాత్రమే కాదు.. దేశమంతటా ఈ ట్రెండ్ ఉండగా.. ఇప్పుడు తెలుగు జనాలకు బాగా తెలిసిన ఒకప్పటి హీరోయిన్ సుమలత కొడుకు హీరో అయిపోతున్నాడు.

అంబరీష్-సుమలత కుమారు అయిన అభిషేక్ అంబరీష్.. తెరంగేట్రం చేయబోతున్నాడనే విషయం గతంలోనే వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆ క్షణం రానే వచ్చేస్తోంది. అమర్ అనే చిత్రం ద్వారా పరిచయం కానున్నాడు అభిషేక్. నగషేకర్ అనే దర్శకుడు రూపొందిస్తున్న చిత్రం ద్వారా కోలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు ఈ కుర్రాడు. సందేశ్ నాగరాజ్ నిర్మాణం వహించనుండగా.. క్రేజీ భామ తాన్యా హోప్ హీరోయిన్ గా నటించేందుకు అంగీకరించింది.

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా.. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. సినిమాల్లో ఎంట్రీ కోసం.. ఈ కుర్రాడు బాగానే శ్రమించాడు. కిక్ బాక్సింగ్ వంటి మార్షల్ ఆర్ట్స్ ను.. ప్రత్యేకంగా థాయ్ ల్యాండ్ వెళ్లి మరీ నేర్చుకున్నాడు. కొన్ని నెలలపాటు కఠోర శ్రమ అనంతరమే ఇండస్ట్రీలోకి వస్తున్నాడు. అభిషేక్ అంబరీష్ రూపొందే ఈ చిత్రాన్ని.. భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ మంచు హీరోలు విష్ణు.. మనోజ్ లు ఇతడికి క్లోజ్ ఫ్రెండ్స్.