నా భార్య నన్ను మోసం చేసింది, విడాకులిచ్చేస్తాను : అమీర్ ఖాన్

0Amir-khan-to-divorce-his-wifeలైట్-వెల్టర్‌వెయిట్ మాజీ వరల్డ్ చాంపియన్ అమీర్ ఖాన్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. తన భార్యకు తన ప్రత్యర్థి, హెవీ వెయిట్ బాక్సర్ ఆంథోనీ జోషువాతో అఫైర్ ఉందని, తనను ఆమె మోసం చేసిందని ట్వీట్లు ఇచ్చాడు. తన భార్య ఫరియల్ మఖ్దూమ్‌కు విడాకులిచ్చేస్తానని, త్వరలోనే విడాకుల పిటిషన్ దాఖలు చేస్తానని ప్రకటించాడు. తన భార్య మరొక బాక్సర్‌తో అఫైర్ నడుపుతోందని బయటి ప్రపంచానికి తెలియజేస్తున్నానని ట్వీట్ చేశాడు. ఇలాంటి వ్యక్తి కోసం తాను తన కుటుంబాన్ని, స్నేహితులను వదులుకున్నానన్నాడు. జోషువాలాంటి మగాళ్ళు తన ఎంగిలిని తీసుకోవచ్చునని మరో ట్వీట్ చేశాడు. మరొకడితో ఉండాలని తాను ఎంతగా కోరుకుంటున్నదీ ఫరియల్ తనకు చెప్పిందన్నాడు. అందువల్ల తామిద్దరమూ విడిపోవడానికి ఓ అంగీకారానికి వచ్చామని, ప్రస్తుతం తాను దుబాయ్‌లో ఉంటున్నానని పేర్కొన్నాడు. ఫరియల్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు.

అమీర్ ఖాన్ ఆరోపణలపై వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ జోషువా స్పందిస్తూ తాను ఫరియల్‌ను ఎప్పుడూ చూడలేదన్నాడు. అమీర్ ఖాన్ భార్యతో పడుకున్నది తాను కాదన్నాడు. మీ పరిస్థితులను మీరే చక్కదిద్దుకోవాలని సలహా ఇచ్చాడు. తనకు తన వుమెన్ బీబీడబ్ల్యూ అంటేనే ఇష్టమన్నాడు.