చంద్రబాబుకి అమిత్ షా లేఖ

0ఎన్డీఏ కూటమి నుండి తెలుగు దేశం పార్టీ బయటికివచ్చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి బిజెపి చేసిన అన్యాయం కు నిరసనగా టీడీపీ ఎన్డీఏ కూటమి నుండి తప్పుకుంది. తాజాగా ఈ అంశంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు.

టీడీపీ , ఎన్డీఏ నుంచి బయటకు వస్తూ చంద్రబాబు రాసిన లేఖకు అమిత్‌షా సమాధానమిచ్చారు. తీదేపీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం తరఫున చేపట్టిన అనేక కార్యక్రమాలను, ఏపీకి ఇచ్చిన ప్రాజెక్టుల వివరాలను 9 పేజీల లేఖలో అమిత్‌షా ప్రస్తావించారు. అభివృద్ధి కంటే రాజకీయపరమైన అంశాల కారణంగానే టీడీపీ బయటకు వెళ్లినట్లు అనిపిస్తోందని లేఖలో చెప్పుకొచ్చారు. ఏపీకి సంబంధించి ఏ చిన్న విషయంలోనూ వెనకడుగు వేయలేదని ఈ లేఖలో వివరించారు అమిత్ షా.